
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ దేశం నుంచి పారిపోయే ప్రయత్నంలో కాబూల్ విమానాశ్రయంలో 12మంది మరణించిన నేపథ్యంలో తాలిబాన్ల అధికార ప్రతినిధి అప్ఘాన్లు ఇళ్లకు వెళ్లాలని కోరారు. కాబూల్ విమానాశ్రయం నుంచి పారిపోయే ప్రయత్నంలో 12 మంది పౌరులు మరణించారని తాలిబాన్ అధికారులు ధ్రువీకరించారు. విమానాశ్రయంలో ప్రజల రద్దీ లేకుండా చూడాలని కోరారు. విదేశాలకు వెళ్లేందుకు చట్టపరమైన హక్కులు లేకుంటే ఇంటికి వెళ్లాలని తాలిబాన్ ఫైటర్లు అఫ్ఘాన్లను కోరారు. తాము కాబూల్ విమానాశ్రయంలో ఎవరినీ బాధపెట్టకూడదని అనుకుంటున్నామని తాలిబాన్ అధికారి చెప్పారు.