
కాబూల్: మహిళల విమాన ప్రయాణాలపై అఫ్ఘానిస్థాన్ దేశంలోని తాలిబన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మగ తోడు లేకుండా మహిళలు దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఎక్కలేరని తాలిబాన్ సర్కారు విమానయాన సంస్థలను ఆదేశించింది. గతంలో బాలికల పాఠశాలలను మూసివేసిన తాలిబన్ సర్కారు ఇటీవల వాటిని తిరిగి తెరిచింది. మగతోడు లేకుండా మహిళలు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు చేయకుండా అప్ఘాన్ సర్కారు నిషేధం విధించడం దిగ్భ్రాంతికి గురిచేసింది.భద్రతా కారణాల దృష్ట్యా మహిళల ప్రయాణాలపై కొత్త ఆంక్షలు విధించామని అఫ్ఘాన్ సర్కారు విమానయాన సంస్థలకు పంపిన లేఖలో తెలిపింది.
ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న తోడులేని మహిళలను ఆది, సోమవారాల్లో ప్రయాణానికి అనుమతిస్తామని అప్ఘాన్ విమాన యాన రంగ అధికారులు తెలిపారు. శనివారం కాబూల్ విమానాశ్రయంలో టిక్కెట్లు ఉన్న కొంతమంది మహిళలను తిప్పి పంపామని అధికారులు పేర్కొన్నారు.చదువు కోసం విదేశాలకు వెళ్లే మహిళలతో పాటు వారి పురుష బంధువు కూడా ఉండాలని తాలిబాన్ పరిపాలన అధికార ప్రతినిధి గతంలో చెప్పారు.సుదూర ప్రయాణాలకు మహిళల వెంట మగ తోడు ఉండాలనే నిబంధనపై అఫ్ఘాన్ మహిళలు, హక్కుల సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
ఇవి కూడా చదవండి