తాలిబన్ల సంబరం.. స్పందించని Afghan జనం

ABN , First Publish Date - 2021-10-26T22:11:03+05:30 IST

తాలిబన్ ప్రభుత్వ పెద్దలు అయితే అఫ్ఘాన్ విజయంపై తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘అఫ్ఘాన్ జట్టుకు అభినందనలు. భవిష్యత్‌లో ఇలాంటి విజయాలు అనేకం నమోదు చేయాలని కోరుకుంటున్నాను’’ అని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. ఇక ఖతార్‌లోని తాలిబన్ కార్యాలయం..

తాలిబన్ల సంబరం.. స్పందించని Afghan జనం

కాబూల్: టీ-20 క్రికెట్ సంరంభంలో అఫ్ఘానిస్తాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. స్కాట్లాండ్‌పై జరిగిన తొలి పోరులో విజయం సాధించింది. స్థానిక తాలిబన్ ప్రభుత్వం దీనిపై హర్షం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా తమ జట్టుకు అభినందనలు కూడా తెలియజేసింది. అయితే అఫ్ఘాన్ ప్రజల్లో ఈ హడావుడి ఏమాత్రం కనిపించలేదు. వీధులన్నీ ఎప్పటిలాగే బోసి పోయి ఉన్నాయి. ప్రజలు ఎప్పటిలాగే ఇంటిపట్టున తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాలిబన్ ప్రభుత్వంపై ప్రజల నిరసన అది. క్రికెట్ అంటే అఫ్ఘానీలకు ఇష్టమే కానీ. అందునా తమ జట్టు గెలిచింది. కానీ తాలిబన్ ఏలుబడిలో తమ కష్టాలను తట్టుకుని ఆనందపడే సందర్భం కాదిది. అందుకే టీ-20లో తమ జట్టు విజయంపై తాలిబన్ ప్రభుత్వం ఆనందంలో ఉన్నా అఫ్ఘానీలు మౌనంగానే ఉన్నారు.


తాలిబన్ ప్రభుత్వ పెద్దలు అయితే అఫ్ఘాన్ విజయంపై తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘అఫ్ఘాన్ జట్టుకు అభినందనలు. భవిష్యత్‌లో ఇలాంటి విజయాలు అనేకం నమోదు చేయాలని కోరుకుంటున్నాను’’ అని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. ఇక ఖతార్‌లోని తాలిబన్ కార్యాలయం కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘‘క్షేత్ర స్థాయిలో ఇంతకంటే పెద్ద విజయాలు మనం నమోదు చేయాలి. ముఖ్యంగా రాజకీయ, ఆర్థిక, శాస్త్రీయ రంగాల్లో ఆ ఫలితాలను మనం తొందరలోనే చూడాలి’’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2021-10-26T22:11:03+05:30 IST