లొంగిపోండి లేదంటే చచ్చిపోండి: తాలిబన్ల లేఖలు

ABN , First Publish Date - 2021-08-31T22:17:01+05:30 IST

ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపిన ప్రకారం.. బహిరంగ ప్రదేశాలతో పాటు, చాలా ఇళ్ల తలుపులకు ఈ లేఖలు అంటించారట. అమెరికాకు మద్దతు ఇచ్చిన వారు కోర్టు ముందు లొంగిపోవాలని, లేదంటే మరణశిక్ష అమలు చేస్తామని

లొంగిపోండి లేదంటే చచ్చిపోండి: తాలిబన్ల లేఖలు

కాబూల్: రెండు దశాబ్దాల అనంతరం అఫ్ఘానిస్తాన్‌ నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లాయి. అయితే అఫ్ఘాన్‌లో అమెరికా, బ్రిటన్‌లతో పాటు వాటి మిత్ర బృందాలకు మద్దతు ఇచ్చిన వారిని అంతం చేసే పనిలో తాలిబన్లు మునిగిపోయారు. అయితే దీని కోసం ఇంటింటికి తిరగకుండా బహిరంగ ప్రదేశాల్లో కొన్ని లేఖలు అంటించారు. ‘‘అమెరికా, దాని మిత్ర సేనలకు మద్దతు ఇచ్చినవారు మర్యాదగా లొంగిపోండి లేదంటే చచ్చిపోండి’’ అంటూ ఆ లేఖల్లో రాసుకొచ్చారు.


ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపిన ప్రకారం.. బహిరంగ ప్రదేశాలతో పాటు, చాలా ఇళ్ల తలుపులకు ఈ లేఖలు అంటించారట. అమెరికాకు మద్దతు ఇచ్చిన వారు కోర్టు ముందు లొంగిపోవాలని, లేదంటే మరణశిక్ష అమలు చేస్తామని ఆ లేఖల్లో రాసుకొచ్చినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇంగ్లాండ్ మిలిటరీకి సహాయం చేసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ ‘‘హెల్మాండ్ ప్రావిన్స్‌లో బ్రిటన్ మిలిటరీ ఇక్కడ రోడ్లు నిర్మించింది. ఆ సమయంలో అభివృద్ధి కోసం సహాయం చేశాను. కానీ ఇప్పుడు ఆ విషయాలు బయటికి చెప్పలేను. నేను కూడా బయటి ప్రపంచానికి పెద్దగా కనిపించకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు చావాలని లేదు’’ అని 34 ఏళ్ల ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.

Updated Date - 2021-08-31T22:17:01+05:30 IST