చైనా సాయం కోరిన తాలిబన్లు! ‘‘చెప్పినవన్నీ చేశాం’’ అంటూ..

ABN , First Publish Date - 2022-01-19T02:32:57+05:30 IST

ప్రభుత్వం నడపలేక తాలిబన్ల తంటాలు.. సాయం కోసం చైనాకు విన్నపాలు..

చైనా సాయం కోరిన తాలిబన్లు! ‘‘చెప్పినవన్నీ చేశాం’’ అంటూ..

ఇంటర్నెట్ డెస్క్: అఫ్ఘానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. తమ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు సంపాదించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇంటర్నేషనల్ గుర్తింపు లేకపోవడంతో వారు.. విదేశాల్లోని అఫ్ఘాన్ ప్రభుత్వ నిధులను వినియోగించుకోలేకపోతున్నారు. తాము మారిపోయామని తాలిబన్లు ఎంతగా చెబుతున్నా ప్రపంచ దేశాలు వారి ప్రభుత్వాన్ని గుర్తించేందుకు సంకోచిస్తున్నాయి. ఫలితంగా అఫ్ఘానిస్థాన్‌లో నిధుల కొరత ఏర్పడింది. ప్రభుత్వాన్ని నడపడం తాలిబన్లకు కష్టంగా మారింది. 


ఈ నేపథ్యంలో వారు తాజాగా చైనాను ఆశ్రయించారు. ‘‘మా ప్రభుత్వాన్ని గుర్తించేందుకు అంతర్జాతీయ సమాజం పెట్టిన నిబంధనలకు మేం కట్టుబడ్డాం. కాబట్టి.. ఈ విషయంలో  చైనా చొరవ తీసుకుని మా ఇస్లామిక్ ఎమిరేట్ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలి’’ అంటూ తాలిబన్ల ప్రతినిధి ఒకరు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కాగా.. అఫ్ఘాన్ ప్రభుత్వానికి చెందిన మొత్తం 9 బిలియన్ డాలర్ల నిధులు విదేశాల్లో ఉన్నాయని సమాచారం. 

Updated Date - 2022-01-19T02:32:57+05:30 IST