అంతర్జాతీయ గుర్తింపు కావాలంటే.. తాలిబన్ల తీరు మారాల్సిందే: అమెరికా

ABN , First Publish Date - 2022-01-03T03:01:21+05:30 IST

తాలిబన్లు తమ విధానాల్లో మార్పులు చేసుకుంటేనే అంతర్జాతీయ సమాజం వారి పాలనను గుర్తించగలదని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ తాజాగా స్పష్టం చేశారు.

అంతర్జాతీయ గుర్తింపు కావాలంటే.. తాలిబన్ల తీరు మారాల్సిందే: అమెరికా

ఇంటర్నెట్ డెస్క్: తాలిబన్లు తమ విధానాల్లో మార్పులు చేసుకుంటేనే అంతర్జాతీయ సమాజం వారి పాలనను గుర్తించగలదని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ తాజాగా స్పష్టం చేశారు. అప్ఘాన్ మీడియా కథనాల ప్రకారం.. ఆయన తాలిబన్లను మానవహక్కులు కాపాడాలని, స్వేఛ్చాయుత ప్రయాణాలకు అనుమతించాలని కోరారు. అంతేకాకుండా.. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని, ప్రత్యర్థులపై ప్రతీకార దాడులు మానుకోవాలని కూడా ఆయన సూచించారట. మరోవైపు.. అంతర్జాతీయ గుర్తింపు తమకు ఎంత అవసరమో అంతర్జాతీయ సమాజానికి కూడా అంతే అవసరమని తాలిబన్లు ప్రకటించారు.

Updated Date - 2022-01-03T03:01:21+05:30 IST