మా విషయాల్లో తలదూర్చొద్దు.. టర్కీకి తాలిబన్ల హెచ్చరిక

Published: Tue, 13 Jul 2021 20:52:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మా విషయాల్లో తలదూర్చొద్దు.. టర్కీకి తాలిబన్ల హెచ్చరిక

కాబూల్: అమెరికా సేనలు అఫ్గానిస్థాన్‌ నుంచి వెళ్లిపోయిన తరువాత కూడా కాబూల్ ప్రధాన ఎయిర్‌పోర్టులో తన సేనలను కొనసాగించేందుకు టర్కీ ప్రయత్నించరాదని తాలిబన్లు మంగళవారం నాడు గట్టి హెచ్చరిక పంపారు. ‘‘వారు తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోకుండా ఇక్కడే తిష్ఠ వేద్దామనుకుంటే మేం తగు నిర్ణయం తీసుకోక తప్పదు. ఆ తరువాత వచ్చే పర్యవసానాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.’’ అంటూ తాలిబన్లు హెచ్చరించారు. ఉత్తర అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రాంతాలు ఇప్పటికే తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు భీకర దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. నిరాయుధులైన కొందరు అఫ్గాన్ సైనికులను వారు పొట్టన పెట్టుకున్నట్టు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.