రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు విఫలం

ABN , First Publish Date - 2022-03-01T02:32:41+05:30 IST

నాలుగు రోజుల యుద్ధం అనంతరం సోమవారం బెలారస్ రాజధానిలో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. నాటోలో చేరే అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొలిక్కి రాలేదని తేలింది. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనేది..

రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు విఫలం

మింస్క్‌: నాలుగు రోజుల యుద్ధం అనంతరం సోమవారం బెలారస్ రాజధానిలో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. నాటోలో చేరే అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొలిక్కి రాలేదని తేలింది. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనేది రష్యా ప్రధాన డిమాండ్. కాగా, తమ భూభాగం నుంచి రష్యాన్ దళాల ఉపసంహరణ జరగాలనేది ఉక్రెయిన్ ప్రధాన డిమాండ్. రెండు డిమాండ్లు ఇరు పక్షాలను రుచించలేదని సమాచారం. వాస్తవానికి ఇది ముందుగా ఊహించిందే అయినప్పటికీ ఎంతో కొంత ఫలవంతమైన చర్చలు జరగాలని చాలా మంది ఆశించారు.


ఉక్రెయిన్‌పై దండెత్తి వచ్చిన రష్యా సైనికుల్లో 4,500 మంది మరణించారని ఆ దేశాధినేత వోలోమిర్ జెలెన్‌స్కీ అన్నారు. అయితే గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో 16 మంది చిన్నారులు చనిపోయారని, 45 మంది గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఏడుగురు చిన్నారులు సహా 102 మంది పౌరులు ఉక్రెయిన్‌‌లో చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ సంఖ్య ఇంతకు మించి ఉంటుందని జెనీవా కేంద్రంగా నడుస్తోన్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి పేర్కొంది.

Updated Date - 2022-03-01T02:32:41+05:30 IST