‘నవంబర్‌ స్టోరీ’ సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్: తమన్నా

May 29 2021 @ 19:22PM

ఇటీవల కాలంలో అనేక మంది నటీనటులు వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులు ఆగిపోవడంతో ఇంటిపట్టునే ఉంటున్న నటీనటులు.. వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు అమితాసక్తి చూపుతున్నారు. అలాంటి వారిలో తమన్నా ఒకరు. తాజాగా ఆమె నటించిన వెబ్‌ సిరీస్‌ ‘నవంబర్‌ స్టోరీ’. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మితమైన ఈ వెబ్ సిరీస్.. హాట్‌స్టార్‌, విజయ్‌ టీవీలలో ప్రసారం అవుతోంది. దీనికి బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇందులో తమన్నా, జీఎం కుమార్‌ తండ్రీ కుమార్తెలుగా నటించారు. 


ఈ సిరీస్‌కి వస్తోన్న స్పందనపై మిల్కీబ్యూటీ మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్ళుగా అనేక అడ్డంకులను ఎదుర్కొన్న ఈ వెబ్‌సిరీస్‌.. ఎందరో కృషి ఫలితంగా విజయవంతంగా పూర్తై, ఇటీవలే విడుదలకు నోచుకుంది. ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథకు భాష అడ్డంకి కాదనే విషయం మరోమారు నవంబర్‌ స్టోరీ ద్వారా నిరూపితమైంది. ఈ వెబ్ సిరీస్‌ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు..’’ అని చెప్పుకొచ్చింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.