Tambaram-Nagarkoyil మధ్య రైళ్ల పాక్షిక రద్దు

ABN , First Publish Date - 2022-07-20T16:39:17+05:30 IST

తిరునల్వేలి మార్గంలో రైల్వేలైను మరమ్మతులు చేపట్టనున్న కారణంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఇందులో

Tambaram-Nagarkoyil మధ్య రైళ్ల పాక్షిక రద్దు

చెన్నై, జూలై 19 (ఆంధ్రజ్యోతి): తిరునల్వేలి మార్గంలో రైల్వేలైను మరమ్మతులు చేపట్టనున్న కారణంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఇందులో తాంబరం నుంచి నాగర్‌కోయిల్‌ వెళ్లే రైళ్లు కూడా వున్నాయి. ఆ వివరాలిలా వున్నాయి...

- ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటలకు తాంబరంలో బయలుదేరే ‘అంత్యోదయా ఎక్స్‌ప్రెస్‌’ (20691) నాగర్‌కోయిల్‌ వెళ్లదు. ఆ రైలు తిరునల్వేలి వరకు వెళ్లి ఆగిపోనుంది. అదే విధంగా ఈ నెల 21వ తేదీ సాయంత్రం 3.50 గంటలకు నాగర్‌కోయిల్‌లో బయలుదేరాల్సిన ‘అంత్యోదయా ఎక్స్‌ప్రెస్‌’ (20692) సాయంత్రం 5.05 గంటలకు తిరునల్వేలి నుంచి బయలుదేరుతుంది. 

- ఈ నెల 20వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు తాంబరంలో బయలుదేరే ట్రైవీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22657) తిరునల్వేలి వరకే వెళ్లనుంది. అదే విధంగా ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4.15 గంటలకు నాగర్‌కోయిల్‌లో బయలుదేరాల్సిన ట్రైవీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22658) సాయంత్రం 5.50 గంటలకు తిరునల్వేలి నుంచి బయలుదేరనుంది.


అరక్కోణం - తిరుత్తణి మధ్య ప్రత్యేక రైలు కొనసాగింపు

 ఆడి కృత్తిక ఉత్సవాలను పురస్కరించుకుని అరక్కోణం - తిరుత్తణి - అరక్కోణం ఈఎంయూ ప్రత్యేక రైళ్లను ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది.  


Updated Date - 2022-07-20T16:39:17+05:30 IST