భాగ్యరాజ్‌ వర్సెస్ సెల్వమణి: 24న తమిళ దర్శకుల సంఘం ఎన్నికలు

Published: Fri, 14 Jan 2022 21:57:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భాగ్యరాజ్‌ వర్సెస్ సెల్వమణి: 24న తమిళ దర్శకుల సంఘం ఎన్నికలు

తమిళనాడు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు ఈ నెల 24న జరుగనున్నాయి. దీనికి సంబంధించి పోలింగ్‌ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. ఎన్నికల అధికారిగా న్యాయవాది సెంథిల్‌నాధన్‌ వ్యవహరిస్తారు. అయితే, ఈ ఎన్నికల్లో దర్శకులు కె.భాగ్యరాజ్‌, ఆర్‌.కె. సెల్వమణి సారథ్యంలోని రెండు ప్యానెళ్ల సభ్యులు పోటీపడుతున్నారు. ఇప్పటికే కె. భాగ్యరాజ్‌ టీం తరపున ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేసిన దర్శకులు ఆర్‌.మాధేష్‌, ఎస్‌.ఎళిల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన పదవులకు ఈ నెల 24 సోమవారం పోలింగ్‌ జరుగనుంది. ఇరుజట్ల తరపున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే...


కె.భాగ్యరాజ్‌ పానల్‌: కె.భాగ్యరాజ్‌ (అధ్యక్షుడు),ఆర్‌.పార్తీబన్‌(కార్యదర్శి), వెంకట్‌ప్రభు (కోశాధికారి), సంయుక్త కార్యదర్శులు: రాజా కార్తీక్‌, విరుమాండి, జగదీశన్‌, జెనీఫర్‌ జూలియట్‌.. కార్యనిర్వాహక సభ్యులు: ఆర్‌.పాండ్యరాజన్‌, మంగై అరిరాజన్‌, వేల్‌ మురుగన్‌, శశి, వేల్‌మురుగన్‌, సాయిరమణి, నవీన్‌, శిబి, నాగేంద్రన్‌ జగన్‌, శశి, వి.ప్రభాకర్‌, బాలశేఖర్‌.


ఆర్‌కే సెల్వమణి ప్యానల్‌: ఆర్‌కే సెల్వమణి (అధ్యక్షుడు), ఆర్‌వీ ఉదయకుమార్‌ (కార్యదర్శి), పేరరసు (కోశాధికారి), సంయుక్త కార్యదర్శులు: సుందర్‌.సి, మురుగదాస్‌, లింగుస్వామి, ఏకంబవాణన్.. కార్యనిర్వాహక సభ్యులు: రమేష్‌ఖన్నా, మనోజ్‌ కుమార్‌, మనోబాలా, శరణ్‌, తిరుమలై, ఎ.వెంకటేష్‌, రవిమారియ, ఆర్‌.కన్నన్‌, ముత్తు విడుగు, నంబి, రమేష్‌ ప్రభాకర్‌, క్లారా.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International