తమిళ ఈలమ్‌ నేతలతో Annamalai భేటీ

Published: Wed, 04 May 2022 09:53:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తమిళ ఈలమ్‌ నేతలతో Annamalai భేటీ

చెన్నై: మూడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంక వెళ్ళిన బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు అన్నామలై తమిళ ఈలమ్‌ నేతలను కలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన శ్రీలంక తమిళుల స్థితిగతులను పరిశీలించారు. భారత ప్రభుత్వం వారికి నిర్మించిన గృహసముదాయాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. నల్లూరులోని కందసామి ఆలయాన్ని దర్శించారు. ఆ తర్వాత నల్లై ఆధీనం (పీఠాధిపతి) సోమసుందర దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్యులను కలిసి ఆయన ఆశీస్సులందుకున్నారు. అనంతరం జాఫ్నా జైలులో ఉన్న 12 మంది రామేశ్వరం జాలర్లను కలుసుకునేందుకు అక్కడి జైలు అధికారుల అనుమతి కోరారు. జైలు అధికారులు ఆ దేశ జైళ్ళ శాఖ ఉన్నతాధికారిని సంప్రదించి అనుమతి చ్చారు. దీనితో అన్నామలై ఆహార పదార్థాలను, తినుబండారాలను, దుస్తులను కొనుగోలు చేసి జాఫ్నా జైలుకు వెళ్లి. రామేశ్వరం జాలర్లకు వాటిని అందజేసి, వీలైనంత త్వరగా విడుదల చేయించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం జాఫ్నాలోని తమిళ ఈలమ్‌ నేతలను అన్నామలై కలుసుకున్నారు. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ సీవీ విఘ్నేశ్వరన్‌, తమిళ జాతీయ సమాఖ్య నాయకులు మావై సేనాధిరాజా, ఎంబీ సుమంతన్‌, సీవీకే శివజ్ఞానం, ఎంఈపలు సిద్ధార్థన్‌, సెలం, అడైకల్‌నాధన్‌, శ్రీధరన్‌, డాక్టర్‌ సుందరిలంగం తదితరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాయంత్రం వరకూ అన్నామలై పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం వేకువజామున ఆయన విమానంలో చెన్నైకి బయలుదేరనున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.