శాంతను భాగ్యరాజ్ కెరీర్ మలుపుతిప్పే చిత్రం ‘రావణ కోట్టం’

Sep 19 2021 @ 14:14PM

తమిళ వెటరన్ హీరో కమ్ డైరెక్టర్ కె. భాగ్యరాజా తనయుడు శాంతను భాగ్యరాజా పలు వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తోన్న తాజా చిత్రం ‘రావణ కోట్టం’. కణ్ణన్ రవిగ్రూప్ అధినేత కణ్ణన్ రవి సమర్పణలో విక్రమ్ సుకుమారన్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కయల్ ఆనంది కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు ప్రభు, ఇళవరసు, కుక్ విత్ కోమాళి ఫేమ్ దీప, అరుళ్ దాస్, సుజాత తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 

ఈ చిత్రంపై నిర్మాణ కణ్ణన్ రవి మాట్లాడుతూ.. ‘కరోనా రెండో దశ వ్యాప్తి సమయంలో అనేక ఆంక్షల నడుమ ‘రావణ కోట్టం’ సినిమా షూటింగ్ పూర్తి చేశాం. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరూ ఎంతగానో సహాయ సహకారాలు అందించారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.  హీరో శాంతను భాగ్యరాజ్ కెరీర్ కు ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా పోస్టర్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసి, ఫస్ట్ లుక్ తో పాటు ఆడియో రిలీజ్, మూవీ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తాం’ అని తెలిపారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.