
కడప: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వచ్చిన ఎనమిది మంది తమిళ కూలీలను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖాజీపేట నల్లమల అటవీ ప్రాంతంలో తమిళ కూలీలు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. వీరని ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వచ్చిన తమిళ కూలీలుగా గుర్తించారు. తమిళ కూలీలను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది యత్నం చేశారు. తప్పించుకునే ప్రయత్నంలో కిందపడి ఓ తమిళ కూలీ మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిపై తమిళ కూలీలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఫారెస్ట్ అధికారి ఖాజావలీకి గాయాలయ్యాయి. కూలీలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.