ఐఐటీ మద్రాస్‌లో 12 మందికి కోవిడ్-19 పాజిటివ్

Published: Thu, 21 Apr 2022 18:24:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఐఐటీ మద్రాస్‌లో 12 మందికి కోవిడ్-19 పాజిటివ్

చెన్నై: దేశంలో మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని ఐఐటీ మద్రాస్‌లో 12 మందికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని  రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి స్పష్టం చేశారు. తమిళనాడులో బుధవారం కొత్తగా 31 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ జాగ్రత్తలను సీరియస్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా నివారణకు ఫేస్ మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని చండీగఢ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పేర్కొన్నాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.