కాళ్ళు లేని గొర్రెపిల్లకు చక్రాల బండి

ABN , First Publish Date - 2021-06-14T20:32:05+05:30 IST

పెంపుడు జంతువులను అల్లారుముద్దుగా చూసుకోవడం చాలామంది చేస్తుంటారు.

కాళ్ళు లేని గొర్రెపిల్లకు చక్రాల బండి

తమిళనాడు: పెంపుడు జంతువులను అల్లారుముద్దుగా చూసుకోవడం చాలామంది చేస్తుంటారు. వాటికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి తమిళనాడుకు చెందిన సైమన్. ఆయన ఎంతో ఇష్టంగా కుక్కలు, గొర్రెలు, ఆవులు, కుందేళ్లను పెంచుకుంటారు. అందులో ఓ గొర్రెపిల్ల అంటే సైమన్‌కు చాలా ఇష్టం. అనుకోకుండా ఓ రోజు గొర్రెపిల్ల వెనుక కాళ్లపై నుంచి మోటార్ బైక్ వెల్లడంతో దాని నరాలు చచ్చుబడిపోయాయి. తిరిగి లేవలేకపోయింది. వైద్యులు కూడా లాభంలేదన్నారు. దాంతో తల్లఢిల్లిన సైమన్.. ఆలోచించి  వెయ్యి రూపాయలు వెచ్చించి దానికి ఓ చక్రల బండిని తయారు చేశాడు. ఆ బండి సహాయంతో మేకపిల్ల అడుగులు వేయగలుగుతోంది. సైమన్ కృషివల్లే మేకపిల్ల చక్రాల బండితో తిరగగలుగుతోంది. సైమన్ కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2021-06-14T20:32:05+05:30 IST