Chess Olympiad 2022: పంచెకట్టులో పోటీపడిన మోదీ, స్టాలిన్

ABN , First Publish Date - 2022-07-29T02:05:10+05:30 IST

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu CM MK Stalin) పంచెకట్టులో పోటీ పడ్డారు.

Chess Olympiad 2022: పంచెకట్టులో పోటీపడిన మోదీ, స్టాలిన్

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu CM MK Stalin) పంచెకట్టులో పోటీ పడ్డారు. తమిళనాడు రాజధాని చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్ (44th Chess Olympiad) ప్రారంభ వేడుకల సందర్భంగా ఇద్దరు నేతలూ తమిళ సంప్రదాయ వస్త్ర ధారణతో వచ్చారు. స్టాలిన్ పట్టు వస్త్రాల్లో వస్తే మోదీ తెల్లటి ఖాదీ వస్త్రాలు ధరించారు. ఈ సందర్భంగా మోదీకి స్టాలిన్ దేవాలయ నమూనాను బహుకరించారు.





మోదీ తమిళనాడుకు ఎప్పుడు వచ్చినా ద్రవిడ సంప్రదాయం ప్రకారం వస్త్ర ధారణ ఉండేలా చూసుకుంటారు. గతంలో రజినీకాంత్‌ను కలిసేందుకు వచ్చినప్పుడు కూడా మోదీ పంచెకట్టుతో ఆకట్టుకున్నారు.   


   




2019లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాబలిపురం సందర్శించిన సందర్భంగా మోదీ పంచెకట్టులో మెరిశారు. 






ప్రధానిగా మోదీ ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడి భాష, సంస్కృతీ సంప్రదాయాలు పాటించేందుకు ప్రాధాన్యమిస్తారు. 

Updated Date - 2022-07-29T02:05:10+05:30 IST