
పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు
కార్యక్రమంలో ప్రత్యేక సంచికల ఆవిష్కరణ
చెన్నై, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా తమిళనాడు ఆర్థిక స్థితి ఎంతో బలంగా వుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు పేర్కొన్నారు. ఎన్‌టీసీ గ్రూపు బాక్సరీ లాజిస్టిక్స్, కార్గోనిక్స్ ఎక్స్‌ప్రె్‌సతో రెండు కొత్త వ్యాపారాలు ప్రారంభించింది. దీనిని శుక్రవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో తమిళనాడు భాగస్వామ్యం అతి పెద్దదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలంగా వుందని, అందుకే వివిధ దేశాలకు చెందిన పరిశ్రమలకు ఇక్కడకు తరలి రావడంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అందుకే ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. 2030 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దృఢత్వం కావాలని కోరుకుంటున్నామని, ఈ లక్ష్య సాధన కోసం ఉత్పత్తిదారుల సహకారం ఎంతో అవసరమని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి