తమిళనాడు: నీలగిరిలో ఓ ఇంట్లో ఏనుగు హల్ చల్

ABN , First Publish Date - 2021-12-16T17:43:44+05:30 IST

తమిళనాడు: నీలగిరిలో ఓ ఇంట్లో ఏనుగు హల్ చల్ చేసింది.

తమిళనాడు: నీలగిరిలో ఓ ఇంట్లో ఏనుగు హల్ చల్

తమిళనాడు: నీలగిరిలో ఓ ఇంట్లో ఏనుగు హల్ చల్ చేసింది. బందిపూర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని ఓ ఇంటి వంటగది కిటకీలో తల దూర్చి తొండంతో అందినకాడికి తినుబండారాలను లాగించేసింది. వంటగదిలో చప్పుడు విన్న యజమాని వచ్చి చూసేసరికి కిటికీలో నుంచి ఏనుగు తొండంతో వస్తువులను చిందరవందర చేస్తోంది. దీంతో వారు రకరకాలుగా ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. ఏనుగు మాత్రం వచ్చిన పని పూర్తి చేసేవరకు కదలలేదు. వంటగదిలో ఉన్న సామానులను తన పొడవాటి తొండంతో కిందపడేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Updated Date - 2021-12-16T17:43:44+05:30 IST