బ్యూటీఫుల్‌ కామెడీ చిత్రం Pannikutti

Published: Wed, 06 Jul 2022 14:16:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బ్యూటీఫుల్‌ కామెడీ చిత్రం Pannikutti

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ అధినేత సుభాస్కరన్‌ సమర్పణలో సూపర్‌ టాకీస్‌ భరత్‌ రామ్‌ నిర్మాణంలో దర్శకుడు అనుచరణ్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘పన్నికుట్టి’ (Pannikutti) (పందిపిల్ల). యోగిబాబు (Yogibabu), కరుణాకరన్‌ (Karunakaran) ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకోగా, ఈ 8న చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సినిమా ఆడియో, ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇందులో దర్శకుడు అనుచరణ్‌ (Anucharan) మాట్లాడుతూ.. ‘జీవితంలో నిరాశ నిస్పృహలు ఆవహించివున్న సమయంలో ఒక హాస్య చిత్రాన్ని తెరకెక్కించాలని భావించాను. రవి మురుగయ్య కథే ఈ పన్నికుట్టి.  నిర్మాతకు కథ వినిపించగా ఆయనకు ఎంతో నచ్చింది. ఓ పందిపిల్లతో షూట్‌ చేశాం. ఈ చిత్రాన్ని చూసిన  ప్రతి ఒక్క ప్రేక్షకుడి ముఖంపై నవ్వు కనిపిస్తుంది. ఇది ఒక బ్యూటీఫుల్‌ కామెడీ మూవీ’ అని అన్నారు. నటుడు కరుణాకరన్‌ మాట్లాడుతూ.. ‘ఒక పాత్ర మనకు లభించినపుడు ఆ పాత్ర చేసేందుకు మనం అర్హులమా? లేదా ఆ పాత్రకు న్యాయం చేయగలమా? అని బేరీజు వేసుకుంటాను. ఆ ప్రకారంగా దర్శకుడు చెప్పగానే నా పాత్ర ఎంతగానో నచ్చడంతో సమ్మతించాను. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమతమ పాత్రలకు జీవం పోశారు’ అని చెప్పారు. సంగీత దర్శకుడు కె (K) , నిర్మాత షమీర్‌ (Shameer), కొత్త నటి లక్ష్మీ ప్రియ (Lakshmi Priya) తదితరులు మాట్లాడారు. గతంలో తెలుగులో రవిబాబు (Ravibabu) దర్శకత్వంలో వచ్చిన ‘అదుగో’ (Adugo) చిత్రంలోనూ పందిపిల్ల ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి తమిళంలో వస్తున్న ఈ పందిపిల్ల కథను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International