'ది ఫ్యామిలీ మెన్‌-2'కు.. తమిళ టాప్ దర్శకుడి హెచ్చరిక

Jun 9 2021 @ 15:47PM

'ది ఫ్యామిలీ మెన్‌-2' విడిదల చేసిన అమెజాన్‌ ప్రైమ్ వారిని తమిళ సీనియర్ దర్శకుడు భారతీరాజా హెచ్చరించారు. జూన్ 4 నుండి 'ది ఫ్యామిలీ మెన్‌-1' సీక్వెల్‌గా రూపొందిన 'ది ఫ్యామిలీ మెన్‌-2' ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సమంత అక్కినేని శ్రీలంకకు చెందిన తమిళ యువతిగా న‌టించింది. మొదటిసారి భారీ యాక్షన్ సన్నీవేశాలలోనూ కనిపిస్తుంది. అయితే, సమంత 'ది ఫ్యామిలీ మెన్‌-2'లో త‌మిళ యువ‌తిగా నెగెటివ్ రోల్‌ పోషించడంతో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు మండిప‌డున్నారు. ఇప్పటికే ఈ వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయినా స్ట్రీమింగ్ అవుతుండటంతో తాజాగా సీనియర్ దర్శకులు భారతీరాజా మండిప‌డ్డారు. తమిళ జాతికి వ్యతిరేకంగా ఈ వెబ్‌ సిరీస్ రూపొందించారని, దీనిని విడుదల చేయకూడద‌ని విజ్ఞప్తి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవ‌డం బాధాకరమని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ను తమిళ ద్రోహులు రూపొందించార‌ని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని భారతీరాజా డిమాండ్ చేశారు. లేదంటే అమెజాన్‌ సంస్థపై పోరాటం చేయడానికైనా సిద్దమని స్ప‌ష్టం చేశారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.