కుక్కలతో విన్యాసాలు చేయించిన తమిళనాడు పోలీసులు

Dec 3 2021 @ 13:03PM

చెన్నై : తమిళనాడు పోలీసులు తాము శిక్షణ ఇచ్చిన ఐదు కుక్కల ప్రతిభాపాటవాలను ప్రజలకు చూపించారు. తమిళనాడు పోలీస్ మ్యూజియంలో నిర్వహించిన ప్రదర్శనలో ఈ విన్యాసాలు జరిగాయి. కొన్ని కాగితాల నుంచి ఓ ప్రత్యేక వాసనగల కాగితాన్ని పట్టి ఇవ్వడం, కొన్ని బ్యాగుల నుంచి ప్రత్యేక వాసనగల బ్యాగును గుర్తించడం, రింగులో నుంచి దూకడం వంటి విన్యాసాలతో ఈ కుక్కలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. 
Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.