రాష్ట్రంలో ప్రబలుతున్న డెంగ్యూ

ABN , First Publish Date - 2022-06-29T15:52:03+05:30 IST

రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా

రాష్ట్రంలో ప్రబలుతున్న డెంగ్యూ

                                - త్వరలో ప్రత్యేక వైద్యశిబిరాలు


చెన్నై, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులతో పాటు డెంగ్యూ జ్వరాలు కూడా అధికమవుతుండటంతో ఎవరికి ఏం జ్వరమో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. సాధారణ జ్వరం వచ్చినా అది కరోనాయేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. దీంతో బాధితులకు జ్వ్వరాలపై తగిన స్పష్టత వుండాలని ఆరోగ్యశాఖాధికారులు భావిస్తున్నారు. అందుకే ఎక్కడికక్కడ శిబిరాలు నిర్వహించి, ఎవరికి ఏ జ్వరమో తేల్చి, తగిన చికిత్స అందించాలని కూడా వారు ఆదేశాలు జారీ చేశారు. మున్ముందు ఈ జ్వరాలు పెరిగే అవకాశముండడంతో తక్షణం చర్యలకు ఉపక్రమించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండడంతో డెంగ్యూ జ్వరాలు అధికమైనట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో డెంగ్యూ జ్వరాలను నిరోధించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహించాలని ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ సెల్వవినాయగం జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటిలో క్లోరిన్‌ కలపాలని, పారిశుధ్య కార్యక్రమాలను కూడా ముమ్మరం చేయాలని ఆదేశించారు. డెంగ్యూ జ్వరాలు అధికంగా ఉన్న జిల్లాలకు చేరువగా ఉన్న జిల్లాల్లో ఆ జ్వరాలు రాకుండా కట్టుదిట్టమైన నిరోధక చర్యలు చేపట్టాలని కూడా ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2022-06-29T15:52:03+05:30 IST