రాష్ట్రానికి భారీ వర్షసూచన

ABN , First Publish Date - 2021-05-09T16:33:35+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ పరిశోధనశాఖ శనివారం ఒక ప్రకటన వి డుదల చేసింది. శుక్రవారం శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తరకన్నడ, ఉ

రాష్ట్రానికి భారీ వర్షసూచన


బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ పరిశోధనశాఖ శనివారం ఒక ప్రకటన వి డుదల చేసింది. శుక్రవారం శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తరకన్నడ, ఉడుపి, దక్షిణకన్నడ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కొడగు, బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం నమోదైంది. దక్షిణకన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, దావణగెరె, కొడగు, చిత్రదుర్గ, హాసన్‌ జిల్లాల్లో ఈనెల 10వరకు యెల్లో అలర్ట్‌ ప్రకటించారు. కాగా బాగల్కోటె, విజయపుర, బెళగావి, బీదర్‌, గదగ్‌, హావేరి, కలబుర్గి, హుబ్బళ్ళి, రాయచూరు జిల్లాల్లో మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా దక్షిణకన్నడ, ఉడుపి, బెంగళూరు, ఉత్తరకన్నడ, చిత్రదుర్గలో ఈనెల 12న భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవనుండగా 30-40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉం దని వాతావరణశాఖ ప్రకటనలో పేర్కొంది. 

Updated Date - 2021-05-09T16:33:35+05:30 IST