Russia-Ukraine War: కదనరంగంలో దిగిన కోయంబత్తూర్ వైద్య విద్యార్థి

ABN , First Publish Date - 2022-03-08T16:02:33+05:30 IST

వైద్యవిద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన తమిళనాడు విద్యార్థి రష్యా దండయాత్ర నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు....

Russia-Ukraine War: కదనరంగంలో దిగిన కోయంబత్తూర్ వైద్య విద్యార్థి

కైవ్, చెన్నై: వైద్యవిద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన తమిళనాడు విద్యార్థి రష్యా దండయాత్ర నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు తమిళనాడు విద్యార్థి ఉక్రెయిన్‌లోని పారామిలటరీ దళంలో చేరాడు.2018వ సంవత్సరంలో ఉక్రెయిన్ దేశంలోని ఖార్కివ్‌ నగరంలోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువుకోవడానికి సాయినికేష్ ఉక్రెయిన్ వెళ్లారు. సాయినికేష్ వైద్యవిద్య 2022 జులై నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ లోగా ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్ర చేస్తుండటంతో సాయినికేష్ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి చేస్తుండటంతో సాయినికేష్ రవిచంద్రన్ అతని కుటుంబంతో కమ్యూనికేషన్ కోల్పోయారు. 


దీంతో విద్యార్థి తల్లిదండ్రులు భారత రాయబార కార్యాలయం సహాయం కోరారు. ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులు ఎట్టకేలకు సాయినికేష్ ను సంప్రదించగలిగారు. తాను రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలటరీ దళంలో చేరినట్లు సాయినికేష్ తల్లిదండ్రులకు చెప్పారు. 


Updated Date - 2022-03-08T16:02:33+05:30 IST