TS News: తుమ్మల అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య

ABN , First Publish Date - 2022-08-15T20:11:37+05:30 IST

జిల్లా తెల్దారుపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ్మినేని కృష్ణయ్య (Tammineni Krishnaiah) మృతితో తీవ్ర కలకలం రేగింది.

TS News: తుమ్మల అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య

ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తెల్దారుపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ్మినేని కృష్ణయ్య (Tammineni Krishnaiah) మృతితో తీవ్ర కలకలం రేగింది. కృష్ణయ్య బైక్‌పై వెళ్తుండగా ఆయనను ఆటోలో వెంబడించారు. ఆటోతో ఆయన స్కూటర్‌ను ఢీ కొట్టారు. కృష్ణయ్య కిందపడ్డాక వేట కొడవళ్లతో హత్య చేశారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)కు కృష్ణయ్య ప్రధాన అనుచరుడు. ఆంధ్రాబ్యాంకు కర్షక సేవ సహకార సంఘం డైరెక్టర్‌గా కృష్ణయ్య ఉన్నారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు అవుతారు. కృష్ణయ్య సీపీఎం (CPM)తో విభేదించి టీఆర్‌ఎస్‌ (TRS) లో చేరారు. అప్పటి నుంచి తుమ్మలతో సన్నిహితంగా ఉన్నారు. ఈ హత్యకు ఆధిపత్యపోరే కారణమని చెబుతున్నారు. వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావుపై కృష్ణయ్య అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేసి.. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కోటేశ్వర్‌రావు ఇంటిపై దాడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోటేశ్వరావు ఇంటికి డాగ్ స్వ్కాడ్‌‌ను తీసుకెళ్లారు.

Updated Date - 2022-08-15T20:11:37+05:30 IST