భాష నాగరికతను నేర్పిస్తుంది: మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు

ABN , First Publish Date - 2022-09-21T04:50:07+05:30 IST

అమెరికాలోని మినియాపోలిస్(Minneapolis) నగరంలో సెప్టెంబర్ 19న, తెలుగు పాఠశాల పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్థులకు తానా(TANA) సంస్థ ఆధ్వర్యంలో.. సర్టిఫికెట్లు అందజేసి పుస్తకాలు పంపిణి చేశారు.

భాష నాగరికతను నేర్పిస్తుంది: మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు

అమెరికాలోని మినియాపోలిస్(Minneapolis) నగరంలో సెప్టెంబర్ 19న, తెలుగు పాఠశాల పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థినీవిద్యార్థులకు తానా(TANA) సంస్థ ఆధ్వర్యంలో.. సర్టిఫికేట్లు అందజేసి పుస్తకాలు పంపిణి చేశారు. తానా రీజనల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. 


ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు భాష తియ్యదనం, తెలుగుజాతి గొప్పతనాన్ని అమెరికాలో రుచి చూపించారన్నారు. భాషను భావితరాలకు అందజేసేందుకు తానా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భాషను చంపే తరంగా మనం మిగలకూడదని చెప్పారు. ఇప్పటికే పాలకుల అనాలోచిత నిర్ణయాలు తెలుగుభాషకు శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. ‘‘కొన ఊపిరితో కొట్టుకుంటున్న తెలుగు భాషను అమెరికాలోని తెలుగువారు బ్రతికిస్తున్నారు. ఏ జాతి అయితే తమ మాతృభాషను సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది. ఒక జాతి అస్థిత్వాన్ని ప్రత్యేకతను చాటి చెప్పేది మాతృభాషేనన్న విషయాన్నీ గుర్తించాలి’’ అని అన్నారు. 


సాయి బొల్లినేని మాట్లాడుతూ బాషా ఒక సాంస్కృతిక వారధి అని వ్యాఖ్యానించారు. తరాల మధ్య అంతరం రాకుండా మాతృభాష కాపాడుతుందన్నారు. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని మరువకూడదన్నారు. భాష మానవసంబంధాలను పెంపొందించి సమాజాన్ని విడిపోకుండా కాపలా కాస్తుందన్నారు. పిల్లలు తెలుగులో చక్కటి గేయాలు, పద్యాలు పాడి ప్రేక్షకులను అలరించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తానా పాఠశాల కోఆర్డినేటర్ మాలెంపాటి నాగరాజు, అరవపల్లి  వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-21T04:50:07+05:30 IST