డల్లాస్‌లో TANA, ఫేట్ ఫార్మసీ ఆధ్వర్యంలో కోవిడ్ టీకా సేవలు

Dec 8 2021 @ 13:22PM

డల్లాస్, టెక్సస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మరియు ఫేట్ ఫార్మసీ ఆధ్వర్యంలో కోవిడ్ నివారణ కోసం తెలుగు వారికి కరోనా టీకాలను అందించారు. ప్రపంచం అంతా కోవిడ్ మహమ్మారితో తల్లడిల్లుతున్న తరుణంలో “మాస్క్ ధరించండి, శానిటైజర్ తప్పనిసరిగా వాడండి, ప్రతి ఒక్కరు కోవిడ్ టీకాలు తీసుకోండి” అనే నినాదంతో తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, తానా బృందం సారథ్యంలో టీకా సేవల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నవంబరు 3, నవంబరు 14, నవంబరు 27, డిసెంబరు 4వ తేదీలలో తెలుగువారి కోసం పిల్లలు(5 సం. నుండి 11 సం. వరకు), పెద్దలు, భారతదేశం నుంచి వచ్చిన తల్లిదండ్రులకు ఫైజర్, మోడార్నా, జాన్సన్&జాన్సన్ కోవిడ్ టీకాలు ఇచ్చారు. ఆరోగ్య బీమా ఉన్నా, లేకపోయినా 1,200 పైచిలుకు టీకాలను అందించడం జరిగింది. కోవిడ్ టీకా కోసం వచ్చిన వారందరూ తానా, ఫేట్ ఫార్మసీ వారికి ధన్యవాదలు తేలియజేశారు.

ప్రవాస తెలుగువారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్న తానా ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కాలంలో తానా లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడానికి తోడ్పడుతున్నటువంటి దాతలు, కార్యకర్తలకు తానా బృందం ధన్యవాదాలు తెలియజేశారు. తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన మంచి కార్యక్రమాలతో అన్నిసంస్థలతో కలసి పని చేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. రాబోయేకాలంలో మరిన్ని జన ప్రయోజనకరమైన కార్యక్రమాలను తానా అధ్యక్షులు అంజయ్య చౌదరిలావు సహకారంతో మీముందుకు తీసుకువస్తామని తెలిపారు. అందరు తానా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

కోవిడ్ టీకా కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, రాజేష్ అడుసు మిల్లి, సాంబదొడ్డ, పరమేష్ దేవినేని, నాగరాజు నలజుల, డా. ప్రసాద్ తోటకూర, కళ్యాణి తాడిమేటి, మధుమతి వైశ్యరాజు, దీప్తి సూర్యదేవర, చంద్రపోలీస్, ప్రమోద్ నూతేటి, చినసత్యం వీర్నపు, శ్రీదేవి ఘట్టమనేని, లెనిన్ వీరా, గణేష్ నెలజుల, వెంకట్ బొమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఫేట్ ఫార్మసీ అధినేత హరి చింతపల్లితో పాటు వారి బృందం ఎంతో శ్రమించి వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రతిఒక్కరికి టీకాలు అందించారు. టీకా కార్యక్రమం చేపట్టడానికి సహకరించిన ఫేట్ ఫార్మసీ, వండర్‌ల్యాండ్ మోంటిస్సొరీ వారికి, వివిధ ప్రసార మాధ్యమాలకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు. Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.