తానా ఆధ్వర్యంలో టెలి ఆరోగ్య కేంద్రం

ABN , First Publish Date - 2021-11-13T02:28:13+05:30 IST

తెలుగు ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే తానా మరో వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈగ్లోబల్ డాక్టర్స్ వారి సహాయ సహకారాలతో టెలి ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రపంచ వ్యాప్తం

తానా ఆధ్వర్యంలో టెలి ఆరోగ్య కేంద్రం

న్యూయార్క్: తెలుగు ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే తానా మరో వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈగ్లోబల్ డాక్టర్స్ వారి సహాయ సహకారాలతో టెలి ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్లకి అందుబాటులో ఉండే విధంగా.. పలు ఆరోగ్య సమస్యలకి సంబంధించిన సలహాలు, సూచనలకు అమెరికా, యూకే మరియు ఇండియాలో పేరుగాంచిన ప్రముఖ వైద్యులతో ఒక ప్లాటు ఫాంను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే.. ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు (తూర్పు ప్రామాణిక సమయం ) జూమ్ కాల్‌లో వైద్యులు అందుబాటులో ఉంటారని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్యామిలీ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, పెడియాట్రిక్స్, సైకాలజీ, క్రిటికల్ కేర్, నెర్వ్ క్రిటికల్, స్లీప్ మెడిసిన్‌కి సంబందించిన ప్రముఖ వైద్యులు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకునే వారు eglobaldoctors.comలో తమ వివరాలతో పాటు కావాల్సిన సర్వీస్ కూడా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ బృహత్తర కార్య క్రమానికి తానాతో కలిసి ముందుకు వచ్చిన ఈగ్లోబల్ డాక్టర్స్ ప్రతినిధులకు అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 






Updated Date - 2021-11-13T02:28:13+05:30 IST