Dallas: 'తానా' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ

ABN , First Publish Date - 2022-08-07T15:42:48+05:30 IST

అమెరికాలోని పేద విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్ వితరణ అనే కార్యక్రమం తానా (TANA) మాజీ అధ్యక్షుడు డా.నవనీత కృష్ణ ఆలోచన నుండి ప్రారంభమైంది.

Dallas: 'తానా' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ

డల్లాస్: అమెరికాలోని పేద విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్ వితరణ అనే కార్యక్రమం తానా (TANA) మాజీ అధ్యక్షుడు డా.నవనీత కృష్ణ ఆలోచన నుండి ప్రారంభమైంది. తాజాగా ఈ కార్యక్రమాన్ని డల్లాస్‌లో తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ఆధ్వర్యంలో ప్రస్తుత తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి సారథ్యంలో ఏర్పాటు చేశారు. మన తెలుగు వారెందరికో అమెరికా జీవనోపాధి కల్పించింది. సొంత పౌరులతో సమానంగా మన ప్రవాసుల ఎదుగుదలకు ఎన్నోఅవకాశాలు కల్పించింది. ఇలా మనకు ఎంతో ఇచ్చిన ఆ దేశానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రవాస తెలుగువారితో పాటు అమెరికా సమాజంతో మమేకమై ఇక్కడ పేదరికంలో వున్నవారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని తానా బృందం వెల్లడించింది. ఇటువంటి సమాజసేవా కార్యక్రమాలు చేపట్టడానికి, తానా లాంటి స్వచ్చంద సంస్థకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన దాతలు, కార్యకర్తలకు తానా బృందం ధన్యవాదాలు తెలియజేసింది.


ఈ సందర్భంగా డల్లాస్‌లో స్థానిక యూలెస్‌లోని H.E.B  పాఠశాలలో 200 మందికి పైగా పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అట్లాంట నుంచి డల్లాస్‌కు వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని సతీష్ కొమ్మన తెలియజేశారు. తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన మరిన్ని సమాజసేవా కార్యక్రమాలతో అన్ని సంస్థలతో కలసి పనిచేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. రాబోయేకాలంలో తానా అధ్యక్షులు అంజయ్యచౌదరి లావు, తానా కార్యవర్గ బృందం సహకారంతో మీముందుకు వస్తామని, అందరు తానా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. H.E.B ISD సూపరింటిండెంట్ డా. జో హ్యారింగ్టన్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తానా వారు H.E.B  ISD స్కూలువారికి అందిస్తున్న సహాయాన్ని అభినందించి, H.E.B ISD ఫ్యామిలీస్ తరుపున ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు కృతజ్ఞతలు తెలియజేశారు.


తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా పూర్వాధ్యక్షులు డా. నవనీత కృష్ణ ప్రారభించిన బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం అమెరికా దేశం అంతట మంచి ప్రజాదరణ పొందిందన్నారు. అమెరికా మేము ఈదేశంలో చాలా కాలం నుంచి నివశించడాని అవకాశం కల్పించందని, అటువంటి సదవకాశం కల్పించిన ఈదేశ సమాజానికి తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ఈకార్యక్రమం చేపట్టిందని, అలాగే తానాఫౌండేషన్, తానా టీంస్క్వేర్ద్వారామరిన్నిసేవాకార్యక్రమాలుఅమెరికా, ఇండియాలో చేపడుతుందని తెలియజేసారు. తానా వారికి ఈ అవకాసం ఇచ్చిన H.E.B ISD వారికి ధన్యవాదాలు తెలియజేశారు.తానా డల్లాస్ టీం సతీష్ కొమ్మన, లోకేష్ నాయుడు కొణిదల, డా. ప్రసాద్ తోటకూర, శ్రీకాంత్ తొలవరపు, అశోక్ కొల్లా, మురళి వెన్నం, స్థానిక తానా సభ్యులు చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. తానా కోశాధికారి అశోక్ కొల్లా మాట్లాడుతూ.. బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం డల్లాస్‌తో పాటు అమెరికా అంతట పలు నగరాలలో కూడా చేపడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలను తానా ద్వారా నిర్వహిస్తాం అని చెప్పారు. డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, తానా పూర్వాధ్యక్షులు డా. నవనీత కృష్ణ ప్రారంభించిన బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడం చాలా సంతోషం అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికి శుభాభినందనలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం తానా ద్వారా కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.


తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా కార్యవర్గ బృందం శ్రీకాంత్ పొలవరపు, లోకేష్ నాయుడు, చిన సత్యం వీర్నపు, నాగరాజు నలజుల, డా. ప్రసాద్ తోటకూర, చంద్ర పోలీస్, ప్రమోద్ నూతేటి, లెనిన్ వీరా, వెంకట్ బొమ్మ, దిలీప్, సుధీర్ చింతమనేని, పరమేష్ దేవినేని తదితరులు విరాళాలు అందించి, కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. తానా బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం చేపట్టడానికి సహకరించిన H.E.B ISD ప్రతినిధులకు, వివిధ ప్రసార మాధ్యమాలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు.



Updated Date - 2022-08-07T15:42:48+05:30 IST