‘తానా’లో ఎన్నికల వేడి

ABN , First Publish Date - 2021-05-01T12:53:21+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ఎన్నికల వేడి ప్రారంభమైంది.

‘తానా’లో ఎన్నికల వేడి

హైదరాబాద్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ తెలుగువారు ఓటు ద్వారా తానా కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ఈ-మెయిల్‌  బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. బ్యాలెట్ల స్వీకరణ మే 28 వరకు కొనసాగుతుంది. మే 29న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. 


Updated Date - 2021-05-01T12:53:21+05:30 IST