TANA ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నిక!

ABN , First Publish Date - 2022-07-02T03:02:16+05:30 IST

తానా ఫౌండేషన్ ట్రస్టీలు జున్ 30న జరిగిన సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి, కార్యదర్శిగా విద్యాధర్ గారపాటి, కోశాధికారిగా వినయ్ మద్దినేని ఎన్నికయ్యారు. తానా ఫౌండేషన్ చైర్మన్‌గా ఎన్నికైన శశికాంత్ వల్లేపల్లి సుదీర్ఘకాలంగా తానా ఫౌండేషన్‌లో సేవలందిస్తూ, కాంత్ ఫౌండేషన్ స్థాపించి కోట్లాది..

TANA ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నిక!

తానా ఫౌండేషన్ ట్రస్టీలు జున్ 30న జరిగిన సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి, కార్యదర్శిగా విద్యాధర్ గారపాటి, కోశాధికారిగా వినయ్ మద్దినేని ఎన్నికయ్యారు. తానా ఫౌండేషన్ చైర్మన్‌గా ఎన్నికైన శశికాంత్ వల్లేపల్లి సుదీర్ఘకాలంగా తానా ఫౌండేషన్‌లో సేవలందిస్తూ, కాంత్ ఫౌండేషన్ స్థాపించి కోట్లాది రూపాయలు విరాళాలుగా అందించారు. కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడిన కొన్ని వేల కుటుంబాలను ఆదుకోవటానికి కోట్లాది రూపాయల స్వంత నిధులు వెచ్చించారు. తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమం కోఆర్డినేటర్‌గా వెయ్యి మందికి పైగా విద్యార్హులకు పారితోషికాలు అందించారు. శశికాంత్ వల్లేపల్లి తానా ఫౌండేషన్ కోశాధికారిగా, కార్యదర్శిగా, బోస్టన్ తెలుగు అసోసియేషన్ బోర్డు చైర్మన్ గా కూడా వ్యవహరించారు. 


తానా ఫౌండేషన్ కార్యదర్శిగా ఎన్నికైన విద్యాధర్ గారపాటి మూవర్స్ డాట్ కామ్ అధినేతగా అందరికి సుపరిచితులు. ఆయన వందకి పైగా ఉచిత కాన్సర్ క్యాంప్స్‌కి రూపకల్పన చేసారు. తానా సంస్థ కోసం ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ ఆడిన బ్యాట్‌ను 18 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి ఆ విరాళాన్ని తానాకు అందజేశారు. కొన్ని లక్షల డాలర్లు తానా సంస్థ కార్యక్రమాల కోసం వెచ్చించడమే కాకుండా ఎక్కడ తెలుగువారి మహాసభలు జరిగినా మంచినీళ్లు అందించాలనే విశాలహృదయంతో లక్షలాది వాటర్ బాటిల్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యాధర్ గారపాటి గతంలో తానా పబ్లిసిటీ కమిటి చైర్మన్‌గా, న్యూజెర్సీ న్యూయార్క్ ఏరియా రీజినల్ కోఆర్డినేటర్‌గా కూడా వ్యవహరించారు. 


తానా ఫౌండేషన్ కోశాధికారిగా ఎన్నికైన వినయ్ మద్దినేని తానా సౌత్ ఈస్ట్ రీజినల్ కోఆర్డినేటర్‌గా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షుడిగా సేవలిందించారు. అట్లాంటాలో తానా ఉచిత క్లినిక్ ఏర్పాటుకు తీవ్రంగా శ్రమించి వేలాదిమందికి అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలబడి విశేష సేవలిందించారు. కాగా..  తానా ఫౌండేషన్ నూతన నాయకత్వానికి తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-07-02T03:02:16+05:30 IST