తానా ఆధ్వర్యంలో పుస్తక మహోద్యమం..!

ABN , First Publish Date - 2021-10-16T01:03:33+05:30 IST

ప్రజల్లో పఠనాసక్తి నానాటికీ తగ్గిపోతున్న ప్రస్తుతస్థితుల్లో ప్రజలకు మళ్లీ పుస్తకాలపై ఆసక్తి రగిల్చేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) నడుం బిగించింది.

తానా ఆధ్వర్యంలో పుస్తక మహోద్యమం..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రజల్లో పఠనాసక్తి నానాటికీ తగ్గిపోతున్న ప్రస్తుతస్థితుల్లో ప్రజలకు మళ్లీ పుస్తకాలపై ఆసక్తి రగిల్చేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) నడుం బిగించింది.  ‘పుస్తక మహోద్యమం’ పేరిట పఠనాసక్తి పెంపొందించేందుకు తానా ప్రపంచ సాహిత్య వేదిక ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దసరా నుంచి సంక్రాంతి వరకూ నిరాఘాటంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని తానా పిలుపునిచ్చింది. 


ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు..తమకు నచ్చిన పుస్తకాలను బంధువులకు, స్నేహితులకు బహుమతిగా ఇవ్వాలి. ఈ సందర్భంగా దిగిన ఫోటోతో పాటు పుస్తకాన్ని బహూకరించిన వ్యక్తి పేరు, పుస్తకం పేరు, రచయిత పేరు, పుస్తక గ్రహీత పేరు తదితర వివరాలను తానా ప్రపంచ సాహిత్య వేదిక వెబ్‌సైట్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ ఫొటోలను తానా.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి ప్రజల్లో పుస్తకాల పట్ల ఆసక్తి పెరిగేందుకు కృష్టి చేస్తుంది. అంతేకాకుండా.. ఈ మహోద్యమంలో పాల్గొన్న వారికి తానా ‘పుస్తక నేస్తం’ అనే ప్రశంసాపత్రాన్ని జ్ఞాపిగా అందిస్తుంది. 





Updated Date - 2021-10-16T01:03:33+05:30 IST