విద్యార్థులకు ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(TANA) మరోమారు ఆపన్నహస్తం అందించింది. విజయవాడలో మార్చి 19న జరిగిన ఓ కార్యక్రమంలో అమరావతి/విజయవాడ ప్రాంతానికి చెందిన మొత్తం 160 మందికి ‘చేయూత’ పథకం ద్వారా మొత్తం రూ.17 లక్షల విలువైన స్కాలర్‌షిప్స్ అందజేసింది. గవర్నర్‌కు చీఫ్ సెక్రెటరీ అయిన ఆర్.పీ సిసోడియా, మాజీ డీజీపీ మాల కొండయ్య ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో.. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, వ్యవస్థాపక చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ, పాటూరి నాగభూషణం, డా. కేఆర్‌కే ప్రసాద్ పాల్గొన్నారు. శశికాంత్, వల్లేపల్లి నీలిమ, విష్ణు దోనెపూడి తదితరులు దాతలుగా వ్యవహరించారు.
స్కాలర్‌షిప్స్ పొందిన విద్యార్థులు..