‘తానా’ సాహిత్య కార్యక్రమం విజయవంతం

Jul 26 2021 @ 15:25PM

వాషింగ్టన్: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం సాహిత్య కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జులై 25న ‘తెలుగుతనం తెలుగుధనం’ అనే అంశంపై తానా ప్రపంచ సాహిత్య వేదిక.. అంతర్జాలం వేదికగా సాహిత్య సమావేశాన్ని నిర్వహిచించింది. ఈ సమావేశానికి ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. కృతివెంటి శ్రీనివాసరావు, సాహితీవేత్త డా. ఎర్రాప్రగడ రామకృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు సాహితీ అభిమానులు వీక్షించారు. కార్యక్రమం విజయవంతం అవ్వడంపట్ల తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.