'తానా' ప్రపంచ సాహిత్య వేదిక సమావేశం

ABN , First Publish Date - 2021-07-15T01:53:51+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహించే అంతర్జాతీయ దృశ్య సమావేశంలో భాగంగా 15వ సమావేశం ఈ నెల 25న జరుగుతుంది.

'తానా' ప్రపంచ సాహిత్య వేదిక సమావేశం

త్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహించే అంతర్జాతీయ దృశ్య సమావేశంలో భాగంగా 15వ సమావేశం ఈ నెల 25న జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు జరిగే సమావేశంలో ‘తెలుగుతనం తెలుగుధనం’ అనే అంశంపై ప్రసంగాలు ఉంటాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వస్తున్న జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 'పాట-పద్యం-పేరడి-ప్రశ్న'పై ప్రసంగిస్తారు. అలాగే విశిష్ఠ అతిథులుగా వస్తున్న ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు, పత్రికా రచయిత డా. ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ 'మాట తీరు' అనే అంశంపై మాట్లాడితే.. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. కృతివెంటి శ్రీనివాసరావు 'కేంద్ర సాహిత్య అకాడమీ విధి విధానాల'ను వివరిస్తారు. ప్రసాద్‌ తోటకూర నిర్వాహకులుగా, చిగురుమళ్ల శ్రీనివాస్‌ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఈ సమావేశం యుప్‌ టీవీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. 



Updated Date - 2021-07-15T01:53:51+05:30 IST