TANA ఆధ్వర్యంలో డల్లాస్‌లో 'ఫుడ్ డ్రైవ్'

ABN , First Publish Date - 2021-12-11T16:27:35+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్యర్యంలో “ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్”, “నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్” వారు పేదల సహాయార్ధం ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు.

TANA ఆధ్వర్యంలో డల్లాస్‌లో 'ఫుడ్ డ్రైవ్'

డల్లాస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్యర్యంలో “ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్”, “నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్” వారు పేదల సహాయార్ధం ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. కోవిడ్ మహమ్మారితో ఎందరో ఉపాధి కోల్పోయి మనుగడ ఎలా సాగించాలో అని సతమతం అవుతున్న పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ, మానవసేవే మాధవసేవ అనే నినాదంతో తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, తానా బృందం సారథ్యంలో అమెరికాలో నివసిస్తున్న పేదవారికి తిరిగి మనవంతు సహాయసహకారాలు అందించాలనే సదుద్దేశంతో తానా “ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్”, “నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్” వారికి 3000 మందిపైగా ఒక్కరోజుకి సరిపడే వివిధ రకాల ఆహారపదార్ధాలను దానం చేశారు.


అమెరికా మన తెలుగు వారెందరికో జీవనోపాధి కల్పించి, సొంత పౌరులుతో సమానంగా పనిచేయడంలో మన ప్రవాసుల ఎదుగుదలకుఎన్నో అవకాశాలు కల్పించిదనడంలో ఎటువంటి సందేహంలేదు. మనకు ఎంతో ఇచ్చిన దేశానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రవాసంలో వున్న తెలుగువారితో పాటు అమెరికా సమాజంతో మమేకమై ఇక్కడ పేదరికంలో వున్న వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్పడానికి చాలా ఆనందంగా వుందన్నారు.


పేదల సహాయార్ధం ఫుడ్ డ్రైవ్ ర్యక్రమంలో తానా కార్యవర్గ బృందం మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, రాజేష్ అడుసు మిల్లి, సాంబదొడ్డ, పరమేష్ దేవినేని, చిన సత్యం వీర్నపు, నాగరాజు నలజుల, డా. ప్రసాద్ తోటకూర, కళ్యాణి తాడిమేటి, మధుమతి వైశ్యరాజు, దీప్తి సూర్యదేవర, చంద్ర పోలీస్, ప్రమోద్ నూతేటి, శ్రీదేవి ఘట్టమనేని, లెనిన్ వీరా, గణెష్ నలజుల, వెంకట్ బొమ్మ తదితరులు విరాళాలు అందించి కార్యక్రమంలోచురుగ్గా పాల్గొన్నారు. ఫుడ్ డ్రైవ్ చేపట్టడానికి సహకరించిన “ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్”, “నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్” వారికి, వివిధ ప్రసార మాధ్యమాలకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు.


ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తానా లాంటి స్వచ్చంద సంస్థకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన దాతలు, కార్యకర్తలకు తానా బృందం ధన్యవాదాలు తెలియజేశారు. తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన మరిన్ని జనప్రయోజనకరమైన కార్యక్రమాలతో అన్ని సంస్థలతో కలసి పనిచేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరిలావు, తానా బృందం సహకారంతో మీముందుకు తీసుకు వస్తామని, అందరు తానా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.



Updated Date - 2021-12-11T16:27:35+05:30 IST