ltrScrptTheme3

విజయవంతంగా ముగిసిన 'తానా' SAT శిక్షణా తరగతులు

Oct 16 2021 @ 13:04PM

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) ఎంతో ప్రతిష్టాత్మకంగా, విన్నూత్నంగా భావితర విద్యార్థిని విద్యార్ధులకి ఉపయోగపడే SAT(Scholastic Assessment Test) శిక్షణా తరగతులను దిగ్విజయంగా పూర్తి చేసింది. హాసిత్ గారపాటి పీర్ ట్యూటర్‌గా వ్యవహరించిన ఈ శిక్షణ కార్యక్రమం 5 వారాలపాటు కొనసాగింది. సుమారు 400 పైగా విద్యార్థులు ప్రతి సెషన్‌లో పాల్గొని విజయవంతం చేశారు. ఇది అమెరికా కళాశాలలో ప్రవేశం కోసం ప్రతి విద్యార్థి రాయవలసిన ప్రామాణికమైన పరీక్ష. సవాళ్ళతో కూడిన ఇటువంటి పరీక్షలో అత్యుత్తమ స్కోర్ సాధించాలంటే ఎలా సన్నద్ధమవ్వాలి, ఏం చదవాలి, అందులో ఉన్న మెళకువలు తదితర విషయాలు తెలుసుకునే అవకాశం తమకు కలిగింది అని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన తానాకి వారు ధన్యవాదములు తెలిపారు.

అలాగే ట్రైనర్ హాసిత్ గారపాటి చెప్పిన విధానం, విషయ పరిజ్ఞానం పరీక్షలకి ఎంతో ఉపయోగపడుందని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రతి సెషన్‌కి ఒక అరగంట వివిధ రంగాలలో నిష్ణాతులైన యువ ప్రతినిధులు వారి అనుభవాలని పంచుకోవడంతో పాటు, పరీక్షల సన్నద్ధతలో భాగంగా విద్యార్థులు అడిగిన సందేహాలు నివృత్తి చేసి వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. ఈ కీ నోట్ స్పీకర్స్‌గా హిమ తమ్మినీడి, డా.అభినవ్ తూమాటి, తేజస్వి పాతూరు, శృతి నండూరు, చరిష్మా భీమనేని, నేహా అనుమోలు, భైరవి సుందరం, అలేఖ్య భీంరెడ్డి, ప్రియాంక భీంరెడ్డి, నవ్య వోలేటి పాల్గొని తమ అనుభవాలు పంచుకోవడం చాలా అభినందనీయం అని వీళ్లందరినీ సమన్వయ పరిచిన తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్యాధర్ గారపాటికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు. 

తానా కాపిటల్ రీజినల్ కోఆర్డినేటర్, ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన ఉయ్యూరు శ్రీనివాస్ మాట్లాడుతూ భావితర విద్యార్థులకి ఉపయోగపడే కార్యక్రమం చెయ్యటం ఎంతో ఆనందదాయకం అని అన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని మరికొన్ని వారాలలో ACT శిక్షణా తరగతులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే ఇప్పటివరకు జరిగిన అన్ని సెషన్స్ వీడియో రికార్డింగ్స్ కూడా విద్యార్థులకి అందుబాటులో ఉంచుతాము అని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన తానా అధ్యక్షులు అంజయ్య చౌదరికి, తానా లీడర్షిప్‌కి తానా కాపిటల్ రీజియన్ సభ్యుల తరుపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. చివరి సెషన్ సందర్భంగా విద్యార్థులకి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ట్యూటర్ హాసిత్ గారపాటికి అభినందనములు తెలియచేయడానికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా కార్యదర్శి సతీష్ వేమూరి, ఉయ్యూరు శ్రీనివాస్ జాయిన్ కావటం విశేషం. 

ట్యూటర్ హాసిత్ గారపాటి మాట్లాడుతూ చిన్న వయసులోనే ఇంతటి అవకాశం కల్పించినందుకు తానా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అనుభవం తన కెరీర్‌లో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ హాసిత్ గారపాటికి ప్రెసిడెన్షియల్ వాలంటీర్ హౌర్స్ (గంటలు) ఇవ్వటం జరుగుతుందన్నారు. హాసిత్ మాదిరిగానే ఎవరైనా ఔత్సాహిక యువత ముందుకు వస్తే వారికి కుడా ఇలాంటి వేదిక ఇవ్వటంతో పాటు వారికి కూడా వాలంటీర్ హౌర్స్(గంటలు) ఇవ్వటం జరుగుతుంది అని తెలిపారు. హాసిత్ గారపాటికి అందరి సమక్షంలో అచీవ్మెంట్ ప్రోత్సాహిక సర్టిఫికెట్ అందజేశారు. సెషన్‌కి 400 మంది పైచిలుకు ప్రతి సెషన్‌కి రెండు గంటలకు పైగా విరామం లేకుండా అయిదు వారాల పాటు జరగటం మామూలు విషయం కాదు అని పాల్గొన్న విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లితండ్రులు కూడా అభినందనలు అని తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎటువంటి విఘాతాలు కలగకుండా నడిపించిన తానా టీం సభ్యులు ఉయ్యూరుశ్రీనివాస్, విద్యాధర్ గారపాటి, సతీష్ మేకా, ఠాగూర్ మల్లినేనిని అంజయ్య చౌదరి లావు, తానా లీడర్షిప్ తరుపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.


Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.