వంటలు
తందూరీ గోబి

కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్‌ - ఒకటి, పెరుగు- రెండు కప్పులు, అల్లంవెల్లుల్లి పేస్టు- అర స్పూను, కారం పొడి, పసుపు- అర స్పూను, ధనియాల పొడి - స్పూను, ఛాట్‌ మసాలా- స్పూను, శనగ పిండి- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు- తగినంత, కొత్తిమీర తురుము- పావు కప్పు.


తయారుచేసే విధానం: మొదట పెరుగులోని నీళ్లన్నీ ఇంకేలా చేయాలి. కాలీఫ్లవర్‌ పువ్వుల్ని కట్‌ చేసుకొని ఉప్పువేసిన నీళ్లలో మూడు నిమిషాలు ఉడికించి నీళ్లు వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో శనగ పిండి, కారం, మసాలాలు, ఉప్పు, పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమం లో గోబీ పువ్వుల్ని వేసి ఓ రెండు గంటలు మూత పెట్టాలి. ఓవెన్‌లో ఒక్కో గోబీ పువ్వును గ్రిల్‌ లేదా ట్రేలో బేక్‌ చేయాలి. అన్నీ అయ్యాక పైన కొత్తిమీర తురుము, ఛాట్‌ మసాలా చల్లితే సరి.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.