వ్యర్థ రసాయనాల ట్యాంకర్‌ పట్టివేత

ABN , First Publish Date - 2022-07-06T07:04:16+05:30 IST

మండలంలోని దోతిగూడెం గ్రా మంలో వ్యర్థ రసాయ నాలు తీసుకెళ్తున్న ట్యాం కర్‌ను గ్రామస్థులు మం గళవారం రాత్రి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

వ్యర్థ రసాయనాల  ట్యాంకర్‌ పట్టివేత

భూదాన్‌పోచంపల్లి, జూలై 5: మండలంలోని దోతిగూడెం గ్రా మంలో వ్యర్థ రసాయ నాలు తీసుకెళ్తున్న ట్యాం కర్‌ను గ్రామస్థులు మం గళవారం రాత్రి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని హెజిలో కంపెనీకి చెందిన  ట్యాంకర్‌లో వ్యర్థ రసాయనాలు నింపుకుని నాగార్జున సిమెంట్‌ ఫ్యాక్టరీ వైపు వెళ్తుతూ రోడ్డు పక్కన ఉన్న  బ్రిడ్జికి తగలడంతో కెమికల్‌ లీకై రోడ్డుపై పడింది. గమనించిన గ్రామస్థులు ట్యాంకర్‌ను ఆపి ఎస్‌ఐ సైదిరెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే పీసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. శాంపిల్స్‌ సేకరించి ట్యాంక ర్‌ను సీజ్‌ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఇదే కంపెనీకి చెందిన కెమికల్‌ ట్యాంకర్‌ను కూడా గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే శాంపిల్స్‌ సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు  కాలుష్య నియంత్రణ ఈఈ రాజేందర్‌ తెలిపారు



Updated Date - 2022-07-06T07:04:16+05:30 IST