NRI లను అలరించిన TANTEX ఉగాది ఉత్సవాలు, మణిశర్మ సంగీత కచేరీ

ABN , First Publish Date - 2022-05-19T18:12:50+05:30 IST

అమెరికాలో సాహిత్య, సంగీత సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఆధునికతను మేళవించి తెలుగువారిని రంజింపచేస్తున్న TANTEX సంస్థ నిర్వహించిన ఉగాది ఉత్సవాలు ప్రవాసులను అలరించాయి.

NRI లను అలరించిన TANTEX ఉగాది ఉత్సవాలు, మణిశర్మ సంగీత కచేరీ

డాలస్/ఫోర్ట్ వర్త్: అమెరికాలో సాహిత్య, సంగీత సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఆధునికతను మేళవించి తెలుగువారిని రంజింపచేస్తున్న TANTEX సంస్థ నిర్వహించిన ఉగాది ఉత్సవాలు ప్రవాసులను అలరించాయి. డాలస్‌లో మే 15వ తేదీన ప్లానో ఈవెంట్స్ సెంటర్‌లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి, పాలకమండలి అధిపతి వెంకట్ ములుకుట్ల అధ్యక్షతన భరత మాత ప్రార్థనాగీతంతో ప్రారంభమైన కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా ఆసక్తికరంగా సాగాయి. శాస్త్రీయ నృత్యం చూస్తే టాంటెక్స్ వేడుకలలోనే చూడాలి అనేలా కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు. స్థానిక నృత్య పాఠశాలలు రామనవమి, ఉగాది పండుగలు నృత్యరూపంలో ప్రదర్సించిన విధానము పలువురిని ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు పిల్లలు, పెద్దలు చేసిన నృత్యాలు హోరెత్తించాయి. 


ఈ కార్యక్రమంలోభాగంగా సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత బృందం రేవంత్, రాహుల్ సిప్లిగంజ్, సూర్యపవన్, లిప్సిక, అంజనా సౌమ్య, అఖిల ప్రేక్షకులని మరింత ఉత్తేజ పరిచారు. గాయని, గాయకులు సంగీత విభావరితో హైవోల్టేజ్ ఎనర్జిటిక్, నాన్స్‌స్టాప్ పాటలతో కచేరీ నాన్స్‌స్టాప్‌గా 3గంటల పాటు కొనసాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని గాయకులను అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి, కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్చము, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు.


కచేరీ విరామ సమయంలో అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి అందరికి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 1986లో ప్రారంభమైన టాంటెక్స్ సంస్ధ, సంవత్సరం పొడుగున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఏకైక సంస్థ తెలియజేసారు. ఉగాది సందర్భముగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రతిభావంతులని టాంటెక్స్ బృందం పుష్ప గుచ్చము, జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. 


హేమమాలిని చావలి- కళలు&నృత్యం

డా.సత్యం ఉపద్రష్ట- సాహిత్యం

శింధు వెముల, సాహితి వెముల, హరీష్ కుమార్ వెన్నపూస- ఉత్తమ స్వచ్ఛంద సేవకులు

శ్రీజకుప్పం, సంజయ్ వట్టం రెడ్డి- అత్యుత్తమ విద్యా నైపుణ్యం, సమాజసేవ

గోపాల్ పనంగి- సమాజసేవ

డా. పవన్ పమదుర్తి- వైద్య


ఉగాది ఉత్సవాల సమన్వయకర్త సతీష్ బండారు, నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు విందు భోజనం వడ్డించిన ఫూడిస్థాన్ యాజమాన్యంకు, ఎలాంటి లాభాపేక్షా లేకుండా తెరవెనుక నుండి సేవలందించిన కార్యకర్తలందరికి టాంటెక్స్ తరపున కృతఙ్ఞతలు తెలియజేశారు. ప్రసారమాధ్యమాలైన టీవీ9, టీవీ5, సాక్షి, ఐఏసియా టీవీ, రేడియో కారవాన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగు టైమ్స్, NRI2NRI, TNI Liveలకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియచేయటంతో శోభాయమానంగా నిర్వహించిన ఉగాది ఉత్సవాలకి తెరపడింది.







Updated Date - 2022-05-19T18:12:50+05:30 IST