legendary cricket coach తారక్ సిన్హా కన్నుమూత

ABN , First Publish Date - 2021-11-06T16:17:25+05:30 IST

లెజెండరీ క్రికెట్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత తారక్ సిన్హా (71) కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం 71వ ఏట మరణించారు...

legendary cricket coach తారక్ సిన్హా కన్నుమూత

న్యూఢిల్లీ :లెజెండరీ క్రికెట్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత తారక్ సిన్హా కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం 71వ ఏట మరణించారు.ఢిల్లీకి చెందిన తారక్ సిన్హాకు 2018లో ద్రోణాచార్య అవార్డు లభించింది.సిన్హా న్యూఢిల్లీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దేశ్ ప్రేమ్ ఆజాద్, గురుచరణ్ సింగ్, రమాకాంత్ అచ్రేకర్, సునీతా శర్మ తర్వాత ద్రోణాచార్య అవార్డు అందుకున్న ఐదవ భారత క్రికెట్ కోచ్ తారక్ సిన్హా. న్యూఢిల్లీలోని సోనెట్ క్రికెట్ క్లబ్‌లో తారక్ సిన్హా కోచ్ గా పనిచేశారు. ప్రపంచ క్రికెట్‌లో ప్రీమియర్ బ్యాటర్లలో ఒకడైన రిషబ్ పంత్, సిన్హాను తండ్రిగా భావించే వారు.


‘‘సోనెట్ క్లబ్ వ్యవస్థాపకుడు తారక్ సిన్హా రెండు నెలల పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూసిన విషాద వార్తను బరువెక్కిన హృదయంతో పంచుకుంటున్నాం’’ అని సోనెట్ క్రికెట్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.భారత్, ఢిల్లీ క్రికెట్‌కు అనేక రత్నాలను అందించిన సోనెట్ క్రికెట్ క్లబ్‌కు కీలక కోచ్ గా సిన్హా ఉండేవారు.రిషబ్ పంత్, ఆశిష్ నెహ్రా, సంజీవ్ శర్మ, ఆకాష్ చోప్రా, శిఖర్ ధావన్, అంజుమ్ చోప్రా, సురేందర్ ఖన్నా, రణధీర్ సింగ్, రామన్ లాంబా, మనోజ్ ప్రభాకర్, అజయ్ శర్మ, కె.పి. భాస్కర్, అతుల్ వాసన్ లకు తారక్ సిన్హా కోచ్ గా పనిచేశారు. తారక్ సార్ దేశానికి అసాధారణమైన అంతర్జాతీయ క్రికెటర్లను అందించడానికి జీవితాంతం కృషి చేశారని రిషబ్ పంత్ చెప్పారు. 


Updated Date - 2021-11-06T16:17:25+05:30 IST