టార్గెట్‌ 2.50 కోట్ల విత్తన బంతులు

ABN , First Publish Date - 2022-07-06T05:14:05+05:30 IST

హరితహారం కా ర్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇ స్తోందని, ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులు విత్తన బంతులు తయారు చేస్తూ పచ్చ దనాన్ని పెంపొందిస్తున్నారని కలెక్టర్‌ఎస్‌ వెంకట్రా వు అన్నారు.

టార్గెట్‌ 2.50 కోట్ల విత్తన బంతులు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు

-  కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు

- మహిళా సంఘాల సభ్యులకు ఒక రోజు శిక్షణ

మహబూబ్‌నగర్‌, జూలై 5 : హరితహారం కా ర్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇ స్తోందని, ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులు విత్తన బంతులు తయారు చేస్తూ పచ్చ దనాన్ని పెంపొందిస్తున్నారని కలెక్టర్‌ఎస్‌ వెంకట్రా వు అన్నారు. ఈ ఏడాది మహిళా సంఘాల ద్వారా జిల్లాలో 2.50 కోట్ల విత్తన బంతులు తయారు చేయడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. విత్తనబంతుల తయారీపై కేసీఆర్‌ అర్బన్‌ఎకో పా ర్క్‌లో మంగళవారం జిల్లా మహిళా సమాఖ్య, గ్రా మీణాభివృద్ధి, అటవీశాఖ, విద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మహిళలకు ఒకరోజు శిక్షణ కా ర్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్ట ర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గతేడాది రెండు కోట్ల విత్తనబంతులు తయారు చేసి వాటి ద్వారా అతిపెద్ద వాక్యం రాసి గిన్నిస్‌ రికార్డ్‌ సాధిం చిన మహిళలు ఈ ఏడాది 2.50 కోట్ల విత్తన బం తులు తయారు చేసి వారి రికార్డును తిరగ రాయాలని సూచించారు. అడవులు తక్కువగా ఉ న్న కొండలు, గుట్టలు, ప్రభుత్వభూములను గుర్తిం చాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో డీఆర్‌డీవో యాదయ్య,  జిల్లా అటవీశాఖ అధికారి గంగారెడ్డి, అడిషనల్‌ పీడీ శారద, డీడ బ్ల్యూవో జరీనా, జిల్లా సమాఖ్య అఽధ్యక్షురాలు సురేఖ, ధాత్రిఆర్‌ ఎన్జీఓ ఆర్గనైజర్‌ వెంకట్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

కేంద్రాల వద్దే బియ్యం డెలివరీ చేయాలి

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), జూలై 5 : పౌరసరఫరాల శాఖ వారు బియ్యాన్ని నేరుగా అంగన్‌వాడీ కేంద్రాల వద్దే డెలివరి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు. ఈ విష యమై మంగళవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ఐసీడీఎస్‌, పౌరసరఫరాల శాఖ అధి కారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా క్లస్టర్‌ వారిగా డివైడ్‌ చేసి బియ్యం సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, జిల్లా సంక్షేమ అధికారి జరీన, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ జగదీష్‌, డీఎస్‌ఓ వనజాత హాజరయ్యారు.

Updated Date - 2022-07-06T05:14:05+05:30 IST