దినసరి మార్కెట్‌లో సుంకం దోపిడీ

ABN , First Publish Date - 2021-04-18T06:22:29+05:30 IST

స్థానిక దినసరి పబ్లిక్‌ మార్కెట్‌ సుంకా ల వసూలులో టెండరుదారులు దోపిడీకి పాల్పడుతున్నారు. మున్సిపాలిటీ గెజిట్‌ ప్రకారం సుంకాలు వసూలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహ రిస్తున్నారు.

దినసరి మార్కెట్‌లో సుంకం దోపిడీ
చేపల మార్కెట్‌లో విక్రయాలు సాగిస్తున్న చిరు వ్యాపారులు

నిర్ణీత రేట్ల కంటే అధిక వసూళ్లు

బెంబేలెత్తుతున్న చిరు వ్యాపారులు


గుంతకల్లు టౌన, ఏప్రిల్‌ 17: స్థానిక దినసరి పబ్లిక్‌ మార్కెట్‌ సుంకా ల వసూలులో టెండరుదారులు దోపిడీకి పాల్పడుతున్నారు. మున్సిపాలిటీ గెజిట్‌ ప్రకారం సుంకాలు వసూలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహ రిస్తున్నారు. ‘మేం అడిగింది ఇవ్వాలి.. లేకుంటే ఎవరికి చెప్పుకుంటారో చె ప్పుకోండి. భయపడేది లేదు’ అని టెండర్‌దారులు బెదిరిస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. మార్చి 31న దినసరి మార్కెట్‌, మున్సిపల్‌ ప్రదేశా ల్లో వస్తువుల అమ్మకానికి రుసుం, వారపు మార్కెట్‌లో సుంకం వసూలు చేయడానికి రూ.40.60 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారు. మాం సం దుకాణాల సుంకం వసూలుకు రూ.2.25 లక్షలు, పశువధశాలలలో రు సుం, పశు దుకాణాలపై సుంకం వసూలుకు రూ.95వేలు, మేకలు, గొర్రెల వధశాలలో రుసుం వసూలుకు రూ.95 వేలకు వేలం దక్కించుకున్నారు.  పోటీపడి వేలం దక్కించుకుని... చిరువ్యాపారుల మీదపడి దోపిడీ చేస్తున్నా రు. కొన్నేళ్ల నుంచి ఇదేతంతు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గెజిట్‌లో పూల గంపకు రూ.4లు ఉండగా, అందుకు విరుద్ధంగా రూ.20లు వసూలు చేస్తున్నారు.


చేపల విక్రయదారుల నుంచి మొద్దుకు గె జిట్‌ ప్రకారం రూ.10లు ఉండగా రూ.20లు, గంపకు రూ.20లు వసూలు చేస్తున్నారు. మార్కెట్‌లో వాహనాలకు గెజిట్‌ ప్రకారం రూ.20లు ఉండగా, రూ.150లు వసూలు చేస్తున్నారు. చికెన సెంటర్‌కు ప్రతి ఆదివారం మొ ద్దుకు రూ.13లు ఉండగా రూ.100 వసూలు చేస్తున్నారు. కరోనావల్ల వ్యా పారాలు లేక తీవ్ర ఇబ్బందిపడుతున్న తమపై సుంకం నిర్వాహకులు బెదిరించి అధికంగా వసూలు చేయడం దుర్మార్గమని చిరువ్యాపారులు వాపో తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గెజిట్‌ ప్రకారం సుంకం వ సూలు చేసేలా చూడాలని వ్యాపారులు కోరుతున్నారు.   


Updated Date - 2021-04-18T06:22:29+05:30 IST