'మళ్ళీ మొదలైంది': ఓటిటి విడుదల తేదీ ఖరారు

Published: Sun, 23 Jan 2022 12:00:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మళ్ళీ మొదలైంది: ఓటిటి విడుదల తేదీ ఖరారు

'మళ్ళీ మొదలైంది' సినిమా ఓటిటి విడుదల తేదీ ఖరారైంది. సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అయితే, తాజాగా ఈ సినిమాను వచ్చే ఫిబ్రవరి 11న నేరుగా డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు విడుదల తేదీని ఖరారు చేసిన జీ గ్రూప్ వారు అఫీషియల్‌గా ప్రకటించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే?.. అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International