బీజేపీ తెలంగాణ కార్యాలయానికి తరుణ్‌చుగ్

Published: Tue, 14 Jun 2022 11:39:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బీజేపీ తెలంగాణ కార్యాలయానికి తరుణ్‌చుగ్

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ కార్యాలయానికి రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ వచ్చారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. ముఖ్యనేతలు, పదాధికారులతో  తరుణ్‌చుగ్ భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. జాతీయ కార్యవర్గ సమావేశాల‌ కోసం 34కమిటీలను నియమించనున్నారు. ఈ 34కమిటీలకు  తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేయనున్నారు.జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.  ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా.. కేంద్ర క్యాబినెట్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరవుతారు. వీరంతా రెండు రోజులపాటు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.