ఘనంగా TAS 20వ వార్షికోత్సవ సంబరాలు

Published: Sat, 18 Jun 2022 11:07:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఘనంగా TAS 20వ వార్షికోత్సవ సంబరాలు

ఎన్నారై డెస్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా సంస్థ కార్యనిర్వాహణాధికారులు ఈ నెల 11న అత్యంత ఆర్భాటంగా 20 వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమం స్కాట్లాండ్ రాజధాని ఎడింబరోకి సమీపంలోగల డాల్కీత్ స్కూల్ క్యాంపస్‌లో దాదాపు 8 గంటలపాటు నిర్విరామంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగు విద్యార్థులు హాజరయ్యారు. సంస్థ సాంస్కృతిక కార్యదర్శి విజయ్ కుమార్ పర్రి అతిథులకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించాగా.. సంస్థ కోశాధికారి నిరంజన్ నూక కూడా ఆయనతో జత కట్టారు.


ఈ కార్యక్రామానికి ముఖ్య అతిథులుగా ఎడింబరో లార్డ్ ప్రోవోస్ట్ ప్రతినిధి బెయిలీ ‘పాలిన్ ప్లానరీ’, స్కాట్లాండ్‌లోని భారత కాన్సులర్ ‘సత్యవీర్ సింగ్’ పలు భారతీయ భాషా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. టాస్ సంస్థను ఏర్పాటు చేసిన వారిలో ఒకరైన డా. అశోక్ భువనగిరి, ప్రసాద్ మంగళంపల్లి, పూర్వ అధికారిక కార్యవర్గ సభ్యులు కూడా హాజరయ్యారు. సిలికానాంధ్ర మనబడి సంస్థ ద్వారా తెలుగు నేర్చుకుంటున్న చిన్నారులు ‘మా తెలుగు తల్లికి’ గేయాన్ని ఆలపించారు. ప్రాంతీయ కళాకారులు, చిన్నారుల నాట్యంతో ప్రారంభమైన సాంస్కృతిక ప్రదర్శనలు భోజన సమయం వరకు కొనసాగాయి. విజయ్ కుమార్ పర్రి స్వయంగా రూపొందించిన టాస్ 20ఏళ్ల ప్రయాణానికి సంబంధించిన షార్ట్ ఫిలిం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 


తరువాత టాస్ ట్యాగ్గ్ లైన్ కమ్మ్యూ నిటీ, కల్చర్, లాంగ్వేజ్ అనే ప్రాతిపదిక పైన ఆయా రంగాల్లో సేవలు చేసిన వారికి అవార్డులు, మెడల్స్ , ధృవపత్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహూకరించడం జరిగింది. టాస్ మాజీ అధికారులు, పస్ర్తుత అధికారులు, వారి విశిష్టసేవలకు గాను టాస్ 20వ వార్షికోత్సవ లోగోతో ముద్రించిన జ్ఞాపికలను అందుకోగా, కోవిడ్ సమయంలో అంతర్జాలం ద్వా రా అనేక సార్లు సభలు ఏర్పా టు చేసి పజ్రల్లో ధైర్యాన్ని నింపిన తెలుగు డాక్టర్లు ముఖ్య అతిథి బెయిలీ ఫ్లానరీ చేతుల మీదుగా ‘టాస్ సూపర్ స్టార్’ మెడల్స్, గుర్తింపు పత్రాలు అందుకున్నారు. కొవిడ్ సమయంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న సభ్యులకు ఇండియన్ కాన్సులర్ సత్యవీర్ సింగ్ చేతుల మీదుగా టాస్ సూపర్ స్టార్స్ మెడల్స్ వరించాయి. అలాగే స్కాట్లాండ్లో తెలుగు బోధిస్తున్న 6గురు స్వచ్ఛంద ఉపాద్యాయులను టాస్ సుపర్ స్టార్స్ మెడల్స్‌తో సత్కరించారు. భారతదేశ పభ్రుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో ఈ కార్యక్రమాన్ని భాగం చేసిందుకు సత్యవీర్ సింగ్‌కు వియజ్ కుమార్ పర్రి కృతజ్ఞతలు తెలిపారు. 


అనంతరం టాస్ ఛైర్మన్ మైథిలి కెంబూరి, అధ్యక్షుడు శివ చింపిరి టాస్ 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలపడంతోపాటు అతిథులను జ్ఞాపిక మరియు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బెయిలీ ఫ్లానరీ మాట్లాడుతూ.. మొట్టమొదటగా ఒక భారతీయ మూలాలు కలిగిన తెలుగు అసొషియేషన్ ఆఫ్ స్కా ట్లాండ్ సంస్థ..20వ వార్షికోత్సవం జరుపుకోవడం, అందునా అనేక విజయవంతమైన కార్యకలాపాలు చేయడం అభినందనీయం అన్నారు. లార్డ్ ప్రొవోస్ట్ కార్యాలయం తరఫున టాస్‌కు ఎల్లప్పుడూ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చా రు. సత్యవీర్ సింగ్ మాట్లాడుతూ..పప్రంచ వ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో టాస్ లాంటి పెద్ద సంస్థ పాలు పంచుకోవాలని సూచించారు. తెలుగు అసోషియేషన్ ఆఫ్ స్కా ట్లాండ్ సభ్యులకు కాన్సు లర్ సర్వీసులు త్వరితగతిన పూర్తయ్యేలా తమ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తు చేశారు. భారత దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న తరుణంలో టాస్ 20వ వార్షికోత్సవం జరుపుకోవడం కాకతాళీయమని పస్ర్తావించారు. టాస్ అధికారులతో తమకు సత్సంబంధాలున్నయని పరస్పర సహకారంతో ముందుకు సాగనున్నట్టు చెప్పారు.


అనంతరం అశోక్ భువనగిరి మాట్లాడుతూ 40 మందితో టాస్ ప్రారంభమైందన్నారు. టాస్ మొదటి కార్యవర్గ సభ్యుల సహకారం మరువలేనిదని అన్నారు. అందులో పస్రాద్ మంగళంపల్లి చాలా కీలకమైన పాత్ర పోషించారన్నారు. సత్య శ్యాం జయంతి ముందు చూపుతో నియమ నిబంధనలను చాలా స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. రమేష్ గోల్కొండ అత్యంత పకడ్బందీగా సంస్థ అకౌంట్లని తీర్చి దిద్దారని కొనియాడారు. అలాగే ప్రస్తుత కార్యవర్గ అధికారులు టాస్‌ను నూటికి నూరు శాతం ముందుకు తీసుకెళ్లారని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు టాస్ సంస్థకు పనిచేసి సంస్థ అభివృద్ధికి కారణమైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో ఎడింబరొ దీవాలి, స్కాటిష్ ఇండియన్ ఆర్ట్స్ ఫోరం, స్కాటిష్ ఇండియన్ ముస్లిం అసోషియేషన్, కన్నడ అసోషియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ - ఎడింబరొ మరియు బిహారి కమ్మ్యూ నిటి ఆఫ్ స్కా ట్లాండ్ ప్రతినిధులు ఉన్నారు. కాగా.. 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్న మొట్టమొదటి ఇండియన్ మూలాలున్న సంస్థ టాసే అని అన్నారు. ఇందుకు తాము గర్వపడుతున్నామని తెలియజేశారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.