పనులు త్వరగా పూర్తి కావాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-29T05:47:47+05:30 IST

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లాకేంద్రం నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్సులో ఎంపీ లాడ్స్‌, రైతు వేదికలు, క్రిమిటోరియం, పలు అం శాలపై అధికారులతో మాట్లాడారు. రైతు వేదికల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఎంపీ లాడ్స్‌కు సంబంధించి పనులు పూర్తి కాకుంటే బి ల్లులు ఆపివేయాలని సూచించారు.

పనులు త్వరగా పూర్తి కావాలి : కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, నవబంరు 28 : అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లాకేంద్రం నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్సులో ఎంపీ లాడ్స్‌, రైతు వేదికలు, క్రిమిటోరియం, పలు అం శాలపై అధికారులతో మాట్లాడారు. రైతు వేదికల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఎంపీ లాడ్స్‌కు సంబంధించి పనులు పూర్తి కాకుంటే బి ల్లులు ఆపివేయాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నామినేషన్‌ స్థాయిలో ఉన్న వాటికి అవసరమైన చ ర్యలు తీసుకోవాలని, మంజూరైన పనులు మొదలు కాకుంటే వెంటనే ప్రారం భించాలని అన్నారు. బోధన్‌తో పాటు కొన్ని మండలాల్లో పనుల తీరు బాగుందని అభినందించారు. ఇసుక ఎవరికీ ఎంత అవసరం ఉందో అంతే డీడీలు కట్టి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ ఈఈ భవన్న, డీఈలు రాజయ్య, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

గిన్నిస్‌ రికార్డు గ్రహీత విభా శ్రీకి కలెక్టర్‌ ప్రశంసలు

అతి చిన్న వయస్సులో గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో స్థానం సాధించిన జిల్లా కేంద్రానికి చెందిన తేలి విభా శ్రీని కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రశంసించారు. సుభాష్‌ నగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌, ప్రసన్నల కూతురు విభా శ్రీ. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఫస్ట్‌ క్లాస్‌ చదువుతోంది. 2019లో హైదరబాద్‌లోని కళా తోరణంలో నిర్వహించిన బతుకమ్మ తల్లి మహా బృంద నృత్యంలో పాల్గొని అద్భుతమైన ప్రతిభను  చాటింది. ఇలా ఆయా రంగాల్లో ప్రదర్శనలు ఇచ్చి ఆహుతులను అలరించింది. దీంతో ఇటీవల బాలిక గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు సాఽధించింది. ఈ సందర్భంగా శనివారం కలెక్టర్‌ నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇలాంటి మరెన్నో ప్రదర్శనలతో రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా బాలికను కలెక్టర్‌ అభినందించారు.

Updated Date - 2020-11-29T05:47:47+05:30 IST