కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి టాస్క్‌ఫోర్స్

ABN , First Publish Date - 2020-08-09T09:08:48+05:30 IST

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ ఫోర్స్‌లో సంబంధిత

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి టాస్క్‌ఫోర్స్

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ ఫోర్స్‌లో సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఇనిస్టిట్యూషన్లకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. వ్యాక్సిన్‌ గుర్తింపు నుంచి ఫైనాన్సింగ్‌, కొనుగోలు, పంపిణీ, పరిపాలనకు సంబంధించిన అంశాలకు టాస్క్‌ఫోర్స్‌ ప్రాధాన్యం ఇస్తుంది. దాదాపు ఆరు వ్యాక్సిన్లు 3వ దశ లేదా 2-3 దశల క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి.

Updated Date - 2020-08-09T09:08:48+05:30 IST