టాటాకు ‘1ఎంజీ’ డోసు!

Jun 11 2021 @ 02:07AM

  • ఆన్‌లైన్‌ ఫార్మసీలో మెజారిటీ వాటా కొనుగోలు 

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఔషధ విక్రయ పోర్టల్‌ ‘1ఎంజీ’లో మెజారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్లు టాటా డిజిటల్‌ ప్రకటించింది. ఒప్పంద విలువను మాత్రం వెల్లడించలేదు. టాటా గ్రూప్‌ వ్యాపారాల ప్రమోటింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ పూర్తి అనుబంధ సంస్థే టాటా డిజిటల్‌. ఈ మధ్య కాలంలో సంస్థ కుదుర్చుకున్న మూడో కొనుగోలు ఒప్పందమిది.  

1ఎంజీ గురించి: 2015లో ప్రారంభమైన ఈ-హెల్త్‌ పోర్టల్‌ ఇది. ఆన్‌లైన్‌ ద్వారా ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల విక్రయంతో పాటు డయాగ్నోస్టిక్స్‌ సేవ లు, టెలీ కన్సల్టేషన్‌ సేవలు అందిస్తోంది. మూడు పెద్ద డయాగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌లను సైతం నిర్వహిస్తోంది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.